AP: రాజమహేంద్రవరం బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే వినియోగించి తీసుకొచ్చిన స్క్రాప్ మీటర్లు ఉంచిన చోటు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న 6 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి.