KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మిగనూరు రోడ్డు కంట్రోల్ రూమ్ వద్ద మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా కార్మికుల చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.