ADB: నేరడిగొండ మండలంలోని సవర్గావ్ గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మనోధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులను కోరారు. సర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, రవీందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, విలాస్, ప్రతాప్ తదితరులున్నారు.