KNR: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు గ్యాస్ సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలిపారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, సామాన్యులపై భారం మోపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవా రెడ్డి డిమాండ్ చేశారు.