AP: స్మార్ట్ ఫోన్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఫోన్ల వల్ల ఇళ్లలో మనుషుల మధ్య సంభాషణలు తగ్గి, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన వాడకం మానసిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. భర్త, పిల్లలు ఫోన్లకు బానిస కాకుండా మహిళలే వారిని కంట్రోల్ చేయాలని ఆయన హితువు పలికారు.