• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటో డ్రైవర్లకు రహదారి భద్రత పై అవగాహన

BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యచరణలో భాగంగా నేడు అరైవ్- అలైవ్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా, ట్రాఫిక్ నియమాలపై సీఐ ప్రతాప్ అవగాహన సదస్సు నిర్వహించారు.

April 16, 2026 / 12:19 PM IST

NFCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)లో 18 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(మార్చి 18)తో ముగియనుంది. నర్స్, ఫార్మసిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. అర్హత గల 18-35 ఏళ్ల వయసువారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి దరఖాస్తు ఫీజు రూ.100-500 వరకు ఉంది. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు. సైట్: https://www.nfc.gov.in/recruitment.html

April 16, 2026 / 12:19 PM IST

‘రైతులు భూముల రీ సర్వేకు సహకరించాలి’

శ్రీకాకుళం: రైతులు భూముల సర్వేకు సహకరించాలని కోసమాల పీఎసీఎస్ అధ్యక్షుడు సలాన మోహన్రావు కోరారు. గురువారం మెలియాపుట్టి మండలంలో వసుంధర గ్రామములో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూముల రీ సర్వే అయిన తర్వాత రాజముద్రలతో రైతులకు పాసుపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. సరిహద్దుల సమస్యలు ఉంటే తెలియజేయాలి అన్నారు.

April 16, 2026 / 12:19 PM IST

వర్క్ షాప్‌కు ముఖ్యఅతిథిగా రావాలని మంత్రికి ఆహ్వానం

MLG: ఈనెల 18న నిర్వహించనున్న ‘కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్, బాండెడ్ లేబర్’ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కకు ఆహ్వానం అందింది. ఈ మేరకు డీజీ చారు సిన్హా HYD ప్రజాభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఈ సమావేశంలో కీలక చర్చలు ఉంటాయని తెలిపారు.

April 16, 2026 / 12:19 PM IST

నో హెల్మెంట్..నో ఎంట్రీ పోలీసుల విన్నూత్న ఆలోచన

SRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు నాగారం సబ్ ఇన్‌స్పెక్టర్ అఫ్ పోలీస్ విన్నూత్న రీతిలో ఆలోచన చేశారు. బుధవారం ఫణిగిరి గ్రామ సర్పంచ్ ఆద్వర్యంలో పాలకవర్గం సహకారంతో ‘హెల్మెట్ లేనిదే ఊరులోకి ప్రవేశం లేదంటూ’  ప్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరేలా ఉండాలి అని అన్నారు.

April 16, 2026 / 12:19 PM IST

మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీలో జిల్లా ఎమ్మెల్యేలు

ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ వెళ్లారు. ఇతర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.

April 16, 2026 / 12:16 PM IST

దొంగ డాక్టర్ ముఠా అరెస్ట్..!

JN: ఆర్ఎంపీ, పీఎంపీలను తనిఖీ చేసిన దొంగ డాక్టర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన దేవరుప్పులలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. నాగరాజు, హరీశ్, భానుచందర్ అనిల్‌లు ఆర్ఎంపీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు ల్యాబ్ టెక్నీషన్‌లతో పాటు డాక్టర్ సంతోష్ కుమార్‌ను సైతం అరెస్ట్ చేశారు.

April 16, 2026 / 12:16 PM IST

అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరిపై కేసు నమోదు

W.G: అంబేడ్కర్ జయంతి ర్యాలీ వీడియోలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్తూరు ఎస్సై జి.వాసు వివరాల ప్రకారం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలపై నిందితులు అనుచితంగా స్పందించారు. దీనిపై సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన పిల్లి యశ్వంత్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

April 16, 2026 / 12:15 PM IST

ప్రమాదకరంగా గుంతలు.. జర జాగ్రత్త!

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని వికారాబాద్ రూట్ గుంతల మయంగా మారింది. గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు. గుంతల వల్ల రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

April 16, 2026 / 12:15 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్

WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ దుగ్గొండి రైతు వేదికలో నిర్వహించిన ఒకరోజు సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అదనపు రెవిన్యూ కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై సర్పంచులకు మార్గదర్శనం చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు.

April 16, 2026 / 12:15 PM IST

మండల స్థాయి సమావేశానికి హాజరైన ఛైర్మన్

JN: రఘునాథపల్లిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు హాజరయ్యారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు.

April 16, 2026 / 12:14 PM IST

పాత బస్టాండ్ వద్ద హెల్మెట్‌పై అవగాహన

బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీసులు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు.

April 16, 2026 / 12:14 PM IST

అరైవ్ అలైవ్ పోస్టర్లతో ప్రజలకు అవగాహన

BHPL: జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ అనే పేరుతో రోడ్డు భద్రతా పోస్టర్లు రూపొందించారు. ఈ పోస్టర్ల ద్వారా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపవద్దని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడపవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

April 16, 2026 / 12:11 PM IST

‘రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కారం’

SKLM: ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురంలో గురువారం రీ సర్వే గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో గోపాలరావు మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చౌదరి బాబ్జి, డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

April 16, 2026 / 12:10 PM IST

వంకాయలపాడులో ‘బడిబాట’ ర్యాలీ

PLD: ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో పర్యటిస్తూ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. బడి ఈడు పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

April 16, 2026 / 12:08 PM IST