బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పోలీసులు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు.