MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవ కేసులో పలువురు BRS నాయకులు బుధవారం పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. హైకోర్టు తీర్పు మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంలో పోలీస్ స్టేషన్‌లో సంతకం చేశారన్నారు. మంత్రి ప్రోత్బలంతోనే తమపై కావాలనే అక్రమ కేసులు బనాయించారని అన్నారు.
MDK: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు NH 765పై ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ రోడ్డులో భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా యంత్రాంగం వేగంగా అమలు చేస్తోంది.
CTR: చిత్తూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వారి చదువుల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
E.G: పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ రాష్ట్ర అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, గోపాలపురం నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు ముళ్ళపూడి భాపిరాజు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PLD: మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులుగా అధిష్టానం అవకాశం కల్పించింది. మొత్తం ఏడు మందికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపిక జరిగింది. గతంలో కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పని చేశారు. నూతనంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడంతో కార్యకర్తలు అభిమానులు ముఖ్య నేతలు కొమ్మాలపాటికి శుభాకాంక్షలు తెలిపారు.
HYD: రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో ORR పరిధి ముందంజలో నిలిచింది. మొత్తం 1.6 లక్షల ఉద్యోగాలు ఇక్కడ లభించగా, హైదరాబాద్ రీజియన్‌లోని కూకట్‌పల్లి ప్రాంతం ప్రత్యేకంగా నిలుస్తోంది. గత ఆరు నెలల్లోనే ఇక్కడ 81,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ముఖ్యంగా IT, ఇండస్ట్రియల్, ఫార్మా రంగాల్లో భారీగా నియామకాలు జరిగి యువతకు అవకాశాలు పెరిగాయి.
SDPT: హుస్నాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు పెండ్యాల ఐలయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్‌ను కలిసి బుధవారం వినతి పత్రం సమర్పించారు. ముదిరాజ్ సంఘం భవనం, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ అంశంపై బండ ప్రకాష్ సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
JN: జిల్లా కాంగ్రెస్ మెడికల్ & హెల్త్ వింగ్ చైర్మెన్ డా.ఎడెల్లి సంతోష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. నియమ నిబంధనలు ఉల్లంఘించి బెదిరింపులకు పాల్పడిన కారణంగా జిల్లా ఛైర్మన్ పై ఈ వేటు పడినట్లు తెలిపారు. అలాగే మొత్తం జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త కమిటీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు తెలిపారు.
SRPT: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీవోఈ, రెగ్యులర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తుంగతుర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
SRPT: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీవోఈ, రెగ్యులర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్‌లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తుంగతుర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు సోమవారం లాగే నిలకడగా కొనసాగాయి. నిన్న మార్కెట్ సెలవు కాగా, ఇవాళ రైతులు 9 వాహనాల్లో 43 క్వింటాళ్ల పత్తి తీసుకువచ్చారు. దీనికి గరిష్ఠంగా రూ. 8,050, కనిష్టంగా రూ. 7,000 పత్తి ధర పలికింది. మార్కెట్ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులు లావాదేవీలను పర్యవేక్షించారు.
KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో రూ.2.75 కోట్ల అంచనాతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లాలో పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ ఎం.విజయ సునీత సూచించారు. మార్కాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో బుధవారం ఆమె మాట్లాడుతూ.. పట్టు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, ఇతరులకు 50% లభిస్తుందని వివరించారు.
మార్కాపురం జిల్లాలో పట్టు సాగుపై రైతులు ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్ ఎం.విజయ సునీత సూచించారు. మార్కాపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో బుధవారం ఆమె మాట్లాడుతూ.. పట్టు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, ఇతరులకు 50% లభిస్తుందని వివరించారు.
BDK: మణుగూరు మండలం బట్టీల గుంపు గ్రామ పంచాయతీ సర్పంచ్ సరిత, అశ్వాపురం మండలానికి చెందిన పలు గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఇవాళ కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా MLA సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.