• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

NLG: డిండి మండలంలోని ఎర్రారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సీమర్ల కృష్ణయ్యకు చెందిన ఎద్దు పొలంలో మేస్తుండగా, ఒక్కసారిగా ఎల్టీ వైరు తెగి దానిపై పడింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు.

April 16, 2026 / 07:56 PM IST

నారీ శక్తి వందన్ విజయోత్సవ ర్యాలీ

 VZM: జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఆమోదం పొందిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కోట జంక్షన్ నుండి గంటస్తంభం వరకు సాగిన ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

April 16, 2026 / 07:54 PM IST

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న కలెక్టర్

WNP: పెబ్బేరు మండలంలో 364 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పెబ్బేరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. 6,737 మంది మహిళలకు ఏకరూప చీరలు పంపిణీ చేశామన్నారు. 1144 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.81 కోట్లు వడ్డీ లేని రుణాలను అందించామన్నారు.

April 16, 2026 / 07:54 PM IST

దువ్వాడలో షాప్ దొంగతనం కేసు ఛేదన

VSP: దువ్వాడ పరిధిలో జరిగిన షాప్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2,52,500 నగదు, పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 9న షాప్ పైకప్పు పగులగొట్టి రూ.2.75 లక్షలు దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.

April 16, 2026 / 07:54 PM IST

ఇంటిగ్రేటెడ్ పదో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

KMR:తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) పదో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. 14 మంది విద్యార్థులకు 13 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

April 16, 2026 / 07:52 PM IST

పీఎం సూర్య ఘర్ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

సత్యసాయి: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 45,428 దరఖాస్తులు నమోదు కాగా, అధికంగా హిందూపూర్ డివిజన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 272.4 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో త్వరగా జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

April 16, 2026 / 07:50 PM IST

PBKS vs MI: ముంబైకు డబుల్ షాక్

వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రికెల్టన్ (2), సూర్యకుమార్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.4 ఓవర్లకు MI స్కోర్ 14/2గా ఉంది. ప్రస్తుతం నమన్ ధీర్, డికాక్ క్రీజులో ఉన్నారు.

April 16, 2026 / 07:50 PM IST

అన్నవరం ఈవోగా చక్రధరరావు బాధ్యతలు స్వీకరణ

KKD: అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన త్రినాథరావు ద్వారకాతిరుమలకు బదిలీ అవ్వడంతో ప్రభుత్వం ఈయనను నియమించింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించిన చక్రధరరావు, సాయంత్రం స్వామివారి కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

April 16, 2026 / 07:49 PM IST

పర్యాటక హబ్‌గా పల్నాడు

PLD: పల్నాడులోని పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. గురువారం ఆమె పర్యాటక పనులపై సమీక్షించారు. సాగర్, కొండవీడు, కోటప్పకొండ, అమరావతిలో పనులు వేగవంతం చేయాలన్నారు. బోటింగ్, సౌండ్ అండ్ లైట్ షో త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. యాత్రా కేంద్రాల్లో పరిశుభ్రత, వసతులపై దృష్టి సారించాలని సూచించారు.

April 16, 2026 / 07:48 PM IST

స్వీయ జనగణనలో సీఎం చంద్రబాబు

GNTR: రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్ సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.

April 16, 2026 / 07:43 PM IST

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు

NGKL: విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 9 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగుల గుర్తింపు, బెనిఫిట్స్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. సీఎం జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు.

April 16, 2026 / 07:41 PM IST

ముచ్చినపల్లిలో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరణ

NTR: దేశ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన దివంగత వడ్డే ఓబన్న పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే, ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్, వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్ గురువారం ఆవిష్కరించారు.

April 16, 2026 / 07:41 PM IST

బీజేపీ ఎంపీలు స్పందించాలి: కవిత

NZB: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 07:39 PM IST

‘జనగణనతోనే అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన’

VZM: దేశాభివృద్ధిలోను, సంక్షేమ పథకాల రూపకల్పనలోను జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఆమె ‘జనగణన’ కార్యక్రమాన్ని గురువారం అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవో సమక్షంలో ఆమె తన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ‘సెల్ఫ్ ఎన్రోల్మెంట్’ చేసుకున్నారు.

April 16, 2026 / 07:39 PM IST

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించాలి: కలెక్టర్

HNK: 8వ జాతీయ పోషణ పక్షాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తిలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహారం వల్ల పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందుతుందన్నారు. పోషణ లోపం లేని సమాజం కోసం అంతా పని చేయాలని సూచించారు.

April 16, 2026 / 07:37 PM IST