• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈవీ వాహనాల ప్రభావం.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 2 శాతం తగ్గినట్లు జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,058 రిజిస్ట్రేషన్లతో రూ.52.72 కోట్లు, 2024–25లో 12,210 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.53.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈవీల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.

April 6, 2026 / 06:43 AM IST

యాడికిలో సీఎం కాన్వాయ్ రిహార్సల్స్

ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

April 6, 2026 / 06:43 AM IST

నేడు కోహెడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

RR: మాజీ మంత్రి హరీష్ రావు నేడు కొహెడలోని పండ్ల మార్కెట్ భూములను పరిశీలించనున్నట్లు జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 167/1లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడనున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారని పేర్కొన్నారు.

April 6, 2026 / 06:42 AM IST

ఎమ్మెల్యే రమణమూర్తి నేటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సోమవారం ఉ. 10 కు పోలాకి మండలం ఓది పాడు గ్రామంలో, నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత, చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.3 కు సారవకోట మండలం తహశీల్దార్ కార్యాలయనికి శంకుస్థాపన చేస్తారు. సా. 4 కు జలుమూరు KG BV పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభిస్తారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

April 6, 2026 / 06:40 AM IST

విమానాశ్రయ ప్రారంభానికి సన్నాహాలు: మంత్రి

VZM: రాష్ట్రంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా రూపొందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని మంత్రి జనార్ధనరెడ్డి తెలిపారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17,19 ఏదో ఒకరోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ప్రకారం సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు.

April 6, 2026 / 06:39 AM IST

వైరాలో మహిళా కౌన్సిలర్‌పై దాడి కలకలం

KMM: వైరా మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయపై దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమృత పైప్‌లైన్ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో అదే వార్డుకు చెందిన అన్వర్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

April 6, 2026 / 06:38 AM IST

నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం

కడప నగరంలోని నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఇవాళ నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జవాబుపత్రాలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,95,674 జవాబు పత్రాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.

April 6, 2026 / 06:37 AM IST

‘కళ్లు’ మూసిన నిఘా నేత్రాలు

VKB: వికారాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న కెమెరాలు మెయింటినెన్స్ లేక, మరమ్మతులకు గురై నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషించాల్సిన నిఘా నేత్రాలను అధికారులు గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

April 6, 2026 / 06:37 AM IST

భార్యతో గొడవ.. టవర్ ఎక్కిన భర్త

కోనసీమ: ఆలమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ టర్నింగ్ వద్ద చీదల రామారావు అనే వ్యక్తి ఆదివారం భార్యతో గొడవపడి సమీపంలోని హైపవర్ కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై నరేశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రామారావును సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 6, 2026 / 06:37 AM IST

మంచి జీర్ణక్రియకు మండూకాసనం

మండూకాసనం (కప్ప భంగిమ) జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో, టైప్ 2 డయాబెటిస్ నిర్వహణకు తోడ్పడుతుంది. పొట్టపై ఒత్తిడి కలిగించడం ద్వారా బొడ్డు, తుంటి ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. చీలమండల కండరాలను సాగదీసి సయాటికా నొప్పిని తగ్గిస్తుంది.

April 6, 2026 / 06:37 AM IST

వల్లూరులో విగ్రహాలను ఆవిష్కరించిన వేగుళ్ల

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీల విగ్రహాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

April 6, 2026 / 06:31 AM IST

లక్ష్మి నర్సింహా స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

KNR: బెజ్జంకి లక్ష్మి నర్సింహా స్వామిని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బండి సంజయ్ ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

April 6, 2026 / 06:31 AM IST

విద్యార్థులను తీర్చిదిద్దడంలో గురువులదే కీలక పాత్ర: ఎమ్మెల్యే

MBNR: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుడు ఫరూక్ హుస్సేన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తరగతి గదుల్లో సమాజాభివృద్ధికి తోడ్పడిన గురువులు, విశ్రాంతి కాలంలోనూ సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోరారు.

April 6, 2026 / 06:28 AM IST

నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కాకినాడ కలెక్టరేట్లోని సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం వరకు సమస్యలపై వినతులను స్వీకరిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

April 6, 2026 / 06:28 AM IST

భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే: మాజీ మంత్రి

MBNR: సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యా యులపైనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండలం దాచేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఆంజనేయులు గౌడ్ పదవీ విరమణ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 06:27 AM IST