TPT: శ్రీకాళహస్తిలోని శీతాలాంబ గుడి వద్ద ఈనెల 21వ తేదీన మార్కెట్ యార్డు అటెండర్ బాలకృష్ణపై దాడి జరిగింది. ఐదు మంది దాడికి ప్రయత్నించగా వారిలో ముని జయ కృష్ణ ప్రసాద్, హిదాయత్ గతంలో అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు మహేశ్, సోమశేఖర్, నాగరాజును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బైకు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.
NLG: నేటి నుంచి జరిగే గ్రామసభలను విజయవంతం చేయాలని నాంపల్లి ఎంపీడీవో రామకృష్ణ శర్మ కోరారు. మండలంలోని 32 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి సభలో కనీసం 200 మంది పాల్గొనేలా చూడాలన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
HYD: హనుమాన్ జయంతి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గౌలిగూడ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన యాత్ర, 14 ఉప యాత్రలను కలుపుకుంటూ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు సాగనుంది. నగరం అంతా కాషాయమయంగా మారి ‘జై శ్రీరామ్’, ‘బజరంగబలి’ నామస్మరణలతో మారుమోగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్న ఈ వేడుకను పురస్కరించుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
MNCL: జన్నారం మండలంలోని అన్నిగ్రామాలలో భక్తిశ్రద్ధల మధ్య హనుమాన్ జయంతిని భక్తులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, హనుమాన్, పైడిపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయాలు, వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాల్లోని ఆంజనేయస్వామి వారికి వేద పండితులు పూజలు నిర్వహించారు.
దేశీయ పరిశ్రమలకు ఊరటనిస్తూ సప్లయ్ లింక్‌ను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన రసాయనాలపై దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ మినహాయింపులు నేటి నుంచి జూన్ 30 వరకు అమలులో ఉండనున్నాయి.
SRPT: జిల్లా నడిగూడెం నుంచి శాంతినగర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు వాహనదారులకు నరకప్రాయంగా మారాయి. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చే క్రమంలో కంకర పోసి వదిలేయడంతో, ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. ఇవాళ ఆదర్శ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంకరలో దిగబడిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై భవన నిర్మాణ సామాగ్రిని వేసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. ఇసుక, కంకర వంటివి తరలించే సమయంలో వాహన యజమానులు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. లేని యడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) 109 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. 1 డైరెక్టర్-లీగల్, 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. లా డిగ్రీ, CA, BE/BTech, CS, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. డైరెక్టర్‌కు నెలకు రూ.2,05,400-2,24,400.. ఎగ్జిక్యూటివ్‌కు రూ.56,100-1,77,500 మధ్య వేతనం ఉంటుంది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విదేశీ మదుపరులు(FII) పెద్దఎత్తున షేర్లను విక్రయించడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. దాదాపు 2 శాతం మేర నష్టాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.
NRPT: గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్, విజయ్ కుమార్, రమేష్ నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కడప: జమ్మలమడుగులోని పొన్నతోట గ్రామం ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదిక కాబోతోంది. సుమారు 50 ఏళ్ల తర్వాత శ్రీ పెద్దమ్మతల్లి దేవర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. వచ్చే మే నెల 2, 3 తేదీలలో ఈ వేడుకలు జరగనున్నాయి. మొదటగా 1964, 1976లో జరగగా ప్రస్తుతం 2026 సంవత్సరంలో జరగనుంది. ఈ దేవరకు జనం భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.
TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు భారీగా తరలొస్తున్నారు. ఇరుముడి ధరించి కాలినడకన భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని కొంతమంది లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతల మీదగా కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్ని హామీలు హాములు పరిచేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, జిల్లా పార్టీ సెక్రెటరీ శ్రీహరి రాజు తదితరులు ఉన్నారు.
KMR: డోంగ్లీ మండలంలో నేటి నుంచి మూడు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి బాబురావు తెలిపారు. ఉదయం 9:30కి మాధన్ హిప్పర్గ, 10 గంటలకు ఇలేగావ్, 11 గంటలకు సిర్పూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొనాలని బాబురావు కోరారు.