• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇల్లందకుంటలో నేడు సూర్య రథోత్సవం

KNR: అపర భద్రాద్రిగా పేరుపొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన ఘట్టమైన సూర్య రథోత్సవం (చిన్నరథం) నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు నిర్వహకులు పేర్కొన్నారు.

April 2, 2026 / 10:03 AM IST

ONGC గ్యాస్ లీకేజీపై భయం వద్దు: కలెక్టర్

కోనసీమ: పి. గన్నవరం మండలం బెల్లంపూడిలోని ONGC బావి నుంచి స్వల్పంగా గ్యాస్ లీకవుతోందని, ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మూసివేసిన బావి వద్ద ఎటువంటి పైప్‌లైన్ లేవని, అంతా నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. అరికట్టేందుకు అమలాపురం, రాజోలు నుంచి రెండు అగ్నిమాపక వాహనాలను అక్కడే ఉంచినట్లు వెల్లడించారు

April 2, 2026 / 10:02 AM IST

గజ ఈతగాడు ప్రసాద్‌కు ఎస్పీ సత్కారం

KMM: గోదావరి నదిలో మునిగిపోతున్న పలువురి ప్రాణాలను కాపాడిన గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను ఎస్పీ రోహిత్ రాజ్ ఘనంగా సత్కరించారు. ఇటీవలే ప్రసాద్‌కు రవీంద్రభారతిలో సాహస రత్న తిరుపతిలో నేషనల్ అవార్డు లభించిన నేపథ్యంలో ఎస్పీ తన కార్యాలయంలో ఆయనను కుటుంబ సమేతంగా గౌరవించారు. ప్రాణ రక్షణలో ప్రసాద్ చూపుతున్న ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

April 2, 2026 / 10:02 AM IST

ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

WGL: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

April 2, 2026 / 10:02 AM IST

హనుమాన్ జన్మోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాల్ ఛైర్ పర్సన్

KMR జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగినటువంటి హనుమాన్ జన్మోత్సవా కార్యక్రమంలో మున్సిపాల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శ్రీ ఆంజనేయ స్వామి ప్రేమ కరుణ ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో Ex ఛైర్మన్ చాట్ల రాజేశ్వర్, దేవాలయం కమిటీ అధ్యక్షులు ఉన్నారు

April 2, 2026 / 10:00 AM IST

స్విమ్మింగ్‌ఫూల్‌లో పడి ముగ్గురు మృతి

TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. ఫర్హత్(30), ఉమేరా(7), ఆయేషా(5) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2026 / 09:59 AM IST

గుంటూరులో టీ-20 క్రికెట్ ట్రయల్స్.. ఈ నెల 5న నిర్వహణ

గుంటూరులో టీ-20 సీనియర్ బాలుర క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి. GDCA ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ట్రయల్స్ నిర్వహిస్తారు. అరండల్‌పేట మాజేటి గురవయ్య మైదానంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు హాజరు కావాలి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత కిట్, కలర్ డ్రెస్‌తో రావాలి. ఆధార్, డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

April 2, 2026 / 09:57 AM IST

ఈనెల 5న టీ20 క్రికెట్ ట్రయల్స్ నిర్వహణ

గుంటూరులో టీ-20 సీనియర్ బాలుర క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి. GDCA ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ట్రయల్స్ నిర్వహిస్తారు. అరండల్‌పేట మాజేటి గురవయ్య మైదానంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు హాజరు కావాలి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత కిట్, కలర్ డ్రెస్‌తో రావాలి. ఆధార్, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

April 2, 2026 / 09:57 AM IST

శరవేగంగా పొత్కపల్లి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు

PDPL: ఓదెల మండలం పోత్కాపల్లి రూపు నారాయణపేట గ్రామాల మధ్య డబుల్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పోత్కపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించి నాణ్యత లోపం లేకుండా పనులు పూర్తిచేయాలని సూచించారు. మరోవైపు ఇరుగ్రామాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ పనులు కొనసాగిస్తున్నారు.

April 2, 2026 / 09:56 AM IST

నేటి తరాలకు మార్గదర్శకత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

SDPT: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన బహుజన రాజ్యస్థాపన చేసి స్వరాజ్య భావన, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు.

April 2, 2026 / 09:56 AM IST

ఐస్‌క్రీమ్‌ అమ్మితే రూ.3,000 జరిమానా!

AP: ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐస్‌క్రీమ్‌లు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, తమ గ్రామంలోకి ఐస్‌క్రీమ్‌ బండ్లు రావొద్దంటూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిబంధనను మీరి ఎవరైనా అమ్మితే రూ.3 వేలు, ఐస్‌క్రీమ్‌ కొన్న వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

April 2, 2026 / 09:56 AM IST

‘ఈ మందు వాడకండి’

SDPT: ‘పారాక్వాట్ ‘ గడ్డి మందు వాడకంపై ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి స్వరూపరాణి తెలిపారు. ఈ రసాయనం వాడకం వల్ల మనుషులు, పశువులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గడ్డి మందు ఉత్పత్తులను ఎవరూ వాడవద్దని ఆమె సూచించారు.

April 2, 2026 / 09:52 AM IST

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుమార్

ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా ఉన్న అనిల్ కుమార్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఆయన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అనిల్ కుమార్ సారథ్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

April 2, 2026 / 09:52 AM IST

94 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ

CTR: జిల్లా వ్యాప్తంగా బుధవారం 94.43 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,32,880 మందికి గాను తొలి రోజున 2,19,906 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారన్నారు. మిగిలిన 12,974 మందికి గురువారం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

April 2, 2026 / 09:52 AM IST

150 నర్సు పోస్టులకు 7,500 అప్లికేషన్లు..!

GNTR: పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నియామకాలకు భారీగా స్పందన వచ్చింది. మొత్తం 150 ఖాళీలకు 7,500 దరఖాస్తులు చేరాయి. మార్చి 31తో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. స్క్రూటినీ పూర్తి చేసి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేపడతామని అధికారులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

April 2, 2026 / 09:51 AM IST