నిర్మల్ జిల్లా DCC కార్యదర్శిగా నియమితులైన ఏంబడి రాకేష్ ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్‌ను ఉట్నూర్ మండలంలోని MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ప్రతిమను అందజేశారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు.
SKLM: జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘నల్సా వీర్ పరి వార్ సహాయత యోజన-2025’ పథకం పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సైనిక్ బోర్డును సందర్శించారు. మాజీ సైనికులు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలో అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 40.7°C నమోదైంది. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 39.9°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా బాపట్లలో 34°C ఉంది. TGలో కొత్తగూడెం జిల్లాలో గరిష్టంగా 40.7°C నమోదు కాగా, యాదాద్రి జిల్లాలో అత్యల్పంగా 38°C నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
KDP: బ్రహ్మంగారి మఠంలో వెలసిన వీరబ్రహ్మేంద్ర స్వామివారికి భక్తులు సమర్పించే తల నీలాలు వసూలు చేసుకునే హక్కుకు ఈ నెల 9వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి బుధవారం తెలిపారు. వేలం పాటలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పని వేళల్లో తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
AKP: రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 25 సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. రాత్రి వేళలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ కోసం వెంకటాపురం జంక్షన్ నుంచి NAOB వరకు వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వాహన చోదకులు పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు.
VZM: క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పోలీసు అధికారులకు బుధవారం సూచించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రతీ వారం సమావేశాలు నిర్వహించి గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు.
BHPL: చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు దళారుల మాటలను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు.
KMM: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని అఖిలభారత సంఘటిత కార్మిక జిల్లా అధ్యక్షులు విప్లవకుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, రేగులచలక, పాపటపల్లి పంచాయితీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కాలరాస్తుందన్నారు.
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో చిట్యాల మండలం ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు బుధవారం విద్యుత్ సౌకర్యం చేకూరింది. అధికారులతో మాట్లాడి దేవస్థానానికి సరిపడా స్తంభాలు, లైట్లను ఆయన మంజూరు చేయించారు. ఈ సందర్భంగా భక్తులు, పూజారి కృష్ణమోహనాచార్యులు, పల్లపు బుద్ధుడు వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.
E.G: దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. నేలకోట రామదుర్గం కొండపై పౌర్ణమి పూజలకు వచ్చే భక్తులు రాత్రి సమయాల్లో అక్కడ ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. పోచమ్మ గండిని దర్శించుకునే వారు సాయంత్రానికే తిరిగి వెళ్లాలని సూచించారు. కొండల సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
SRCL: పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు.
ASR: జాయింట్ కలెక్టర్ శ్రీపూజ బుధవారం ముంచంగిపుట్టు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. లబ్బూరు ఏకలవ్య మోడల్ రెషిడెన్సియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా బోధన, భోజన వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్బూరు పీహెచ్‌సీ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు
NTR: విజయవాడ ఏపీఏవోఎస్ అసోసియేషన్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సాంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
AP: జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని మంత్రి నారాయణ విమర్శించారు. ‘రాజధానిపై మరో 3 ముక్కలాట మొదలు పెట్టారు. మావిగన్ అంటూ సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజలు కట్టిన పన్నులు అమరావతిలో ఖర్చుచేయం. ఢిల్లీకి వెళ్లి GST గురించి మాట్లాడి వచ్చా. నోటికొచ్చిన రేట్లు చెప్పడం సరికాదు’ అని పేర్కొన్నారు.
KMR: తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశారు. ఈ ఘటన బుధవారం భిక్కనూర్ మండలం ఈసన్నపల్లిలో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మనబడి పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు.