SRCL: పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు.
ASR: జాయింట్ కలెక్టర్ శ్రీపూజ బుధవారం ముంచంగిపుట్టు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. లబ్బూరు ఏకలవ్య మోడల్ రెషిడెన్సియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా బోధన, భోజన వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్బూరు పీహెచ్‌సీ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు
NTR: విజయవాడ ఏపీఏవోఎస్ అసోసియేషన్ హాల్లో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సాంప్రదాయ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తే స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
AP: జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని మంత్రి నారాయణ విమర్శించారు. ‘రాజధానిపై మరో 3 ముక్కలాట మొదలు పెట్టారు. మావిగన్ అంటూ సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజలు కట్టిన పన్నులు అమరావతిలో ఖర్చుచేయం. ఢిల్లీకి వెళ్లి GST గురించి మాట్లాడి వచ్చా. నోటికొచ్చిన రేట్లు చెప్పడం సరికాదు’ అని పేర్కొన్నారు.
KMR: తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశారు. ఈ ఘటన బుధవారం భిక్కనూర్ మండలం ఈసన్నపల్లిలో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మనబడి పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు.
MHBD: ఏజెన్సీ గిరిజన గూడాల్లో ఆదివాసీ ప్రజలు దోపిడీదారుల చేతిలో బలి పశువులుగా మారుతున్నారని ‘తుడుం దెబ్బ’ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల రాము అన్నారు. ఇవాళ కొత్తగూడలో ఆయన మాట్లాడుతూ.. గంగారం మండలం దుబ్బగూడెంలో స్థానిక ఆదివాసీ రైతులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారి ఫర్టిలైజర్ ఎరువులు అమ్మి, అధిక వడ్డీలు వేసి నిలువున దోచుకుంటున్నారని ఆరోపించారు.
కోనసీమ: గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో Ex.Cm జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే వాలంటీర్స్ వ్యవస్థను పక్కన పెట్టిన ఈ ప్రభుత్వం, సచివాలయ వ్యవస్థను కూడా బలహీనపరుస్తున్నారన్నారు.
IPL 2026లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు LSGతో తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ గెలవడం విశేషం. దీంతో ఈసారి ఎలాగైనా DCపై గెలుపొందాలని LSG కసితో బరిలోకి దిగుతోంది.
NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని 1, 2 వార్డుల్లో లో-ఓల్టేజ్ సమస్యపై గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు సర్పంచ్ తక్షణమే స్పందించారు. విద్యుత్ శాఖ AEతో మాట్లాడి బుధవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు. దీంతో స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా పడిపూజ నిర్వహించినట్లు సేవా సమితి కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
SDPT: దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
WMP: ప్రవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ కేంద్రాలు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ -2010 ప్రకారం రేటు చార్జీలను ప్రదర్శించడంతోపాటు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో నిబంధనలకు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
NRPT: మక్తల్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని బుధవారం డీటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో గోవిందరాజులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. మక్తల్, కృష్ణ, మాగనూరు మండలాలకు చెందిన విద్యార్థులు తగిన సదుపాయాలు లేక చదువును మధ్యలోనే విరమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
PDPL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులు అందరూ (ఫ్రెష్ మరియు రెన్యువల్) దరఖాస్తు చేసుకునేలా బాధ్యత వహించాలని సూచించారు.
MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో బుధవారం మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భుజగౌని రాజేశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ BRS నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు భుజగౌని శ్రీకాంత్ గౌడ్ కూడా పాల్గొని రాజేశ్వర్ గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు.