• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్ అబద్ధం ఆడుతున్నారు: టీడీపీ

AP: అమరావతిలో చ.అడుగుకు రూ.12 వేల ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని టీడీపీ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. అబద్ధంతో బతుకుతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.

April 5, 2026 / 02:27 PM IST

‘సింగరేణిలో మెడికల్ బోర్డును యధావిధిగా కొనసాగించాలి’

PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డును యథావిధిగా కొనసాగించాలని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. జీడీకే 2ఏ గనిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాదిగా ఎదురుచూస్తున్న కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించి వారసులకు ఉద్యోగాలివ్వాలన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సిన రూ. 51,149 కోట్ల బొగ్గు బకాయిలను చెల్లించాలన్నారు.

April 5, 2026 / 02:26 PM IST

జగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుతున్నారు: మంత్రి

AP: మాజీ సీఎం జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి ప్రజల నవ్వుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులే ఆయన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 34వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్నిజగన్ అవమానించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య సాక్షిగా వైసీపీకి ప్రజలే చరమగీతం పాడుతారని చెప్పారు. రాష్ట్రానికి అమరావతి ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్నారు.

April 5, 2026 / 02:25 PM IST

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ ఫార్మర్‌‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆదివారం పూజ చేసి ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామన్నారు.

April 5, 2026 / 02:24 PM IST

వేణు గోపాలరావును సత్కరించిన మంత్రి

SKLM: మంత్రి అచ్చెన్నాయుడు ఏపీఎన్జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వేణుగోపాల్‌ను ఆదివారం సత్కరించారు. శ్రీకాకుళంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సత్కారం జరిగింది. అనంతరం బాబు జగత్ జీవన రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 02:23 PM IST

205 మంది మందుబాబులు పట్టుబడ్డారు!

RR: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 205 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 170 బైకులు, 8 త్రీవీలర్, 27 ఫోర్ వీలర్‌లు పట్టుబడ్డాయని తెలిపారు. వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 5, 2026 / 02:22 PM IST

‘సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్’

KNR: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు, బాబూ జగ్జీవన్ రామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కరీంనగర్‌లో జరిగిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. కేంద్రంలో 29 ఏళ్లపాటు మంత్రిగా కొనసాగిన బాబూ జగ్జీవన్ రామ్ దేశ సేవే పరమ ధర్మంగా భావించి ఆచరించి చూపారని తెలిపారు.

April 5, 2026 / 02:21 PM IST

సమ్మిళికృత జీవనోపాదులపై గ్రామ సభ

ADB: నార్నూర్ మండలంలోని దేవరగూడ, ఖైర్డాట్వ గ్రామాల్లో ఇవాళ తెలంగాణ సమ్మిళికృత జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా SERP SPM రవీందర్ రావు ఆధ్వర్యంలో సోషల్ మ్యాప్, నిరుపేదల అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, మండల సమైక్య సిబ్బంది, CRP బృందం పాల్గొన్నారు.

April 5, 2026 / 02:21 PM IST

జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

GDWL: జిల్లాలో సామాజిక సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

April 5, 2026 / 02:20 PM IST

‘లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి’

E.G: తమ విలువైన వస్తువులైన బంగారం, వెండి, పత్రాలను దొంగతనాల బారి నుంచి కాపాడుకోవడానికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కడియం CI వెంకటేశ్వరావు ఆదివారం సూచించారు. కుటుంబాలు ఎక్కువ కాలం పాటు తమ ఇళ్లను విడిచి వెళ్తున్నప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. తద్వారా పోలీసులు ప్రజల కదలికను పర్యవేక్షిస్తారన్నారు.

April 5, 2026 / 02:20 PM IST

ప్రజలకు ఇబ్బందులకు కలుగకుండా చూడడమే లక్ష్యం

BHPL: రేగొండ గ్రామంలో రోడ్డు ఇరుపక్కలా పెరిగిన పిచ్చి చెట్లను ఆదివారం గ్రామ సర్పంచ్ వానరాశి మౌనిక- అంజి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలోJCB సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడమే లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

April 5, 2026 / 02:20 PM IST

అశ్లీల సైట్‌లో నా ఫొటో: జాన్వీకపూర్

హీరోయిన్ జాన్వీకపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయసులో అశ్లీల వెబ్‌సైట్‌లో తన మార్ఫింగ్ ఫొటోలు చూసి షాక్‌కు గురైనట్లు తెలిపింది. ‘అప్పుడు నేను స్కూల్‌లో చదువుకుంటున్నా. మాకు ఐటీ క్లాస్ జరిగినప్పుడు తోటి విద్యార్థులు అలాంటి సైట్స్ ఓపెన్ చేస్తుండేవారు. అలా ఓసారి ఆ వెబ్‌సైట్‌లో నా ఫొటోలు చూసి చెప్పారు. ఆక్షణం నేనెంతో బాధపడ్డా’ అని పేర్కొంది.

April 5, 2026 / 02:20 PM IST

జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

JN: బాబు జగ్జీవన్ రామ్ సూచించిన మార్గంలో నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకునే విధంగానే నా పని తీరు ఉంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎంతో గొప్పవని, చిరస్మరణీయమని కొనియాడారు.

April 5, 2026 / 02:18 PM IST

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వెంకటాపూర్ సర్పంచ్

MNCL: మందమర్రి మండలం వెంకటాపూర్ సర్పంచ్ వెంకటేశ్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వివేక్ సమక్షంలో ఆయన పార్టీలో చేరగా, మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. ఆరు గ్యారెంటీలను గ్రామంలోని అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తానన్నారు.

April 5, 2026 / 02:18 PM IST

SRH vs LSG: హిస్టరీ రిపీట్ అవుతుందా..?

ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో SRH vs LSG మ్యాచ్ జరగనుంది. గతంలో ఇదే స్టేడియంలో LSGతో జరిగిన మ్యాచ్‌లో SRH బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఓపెనర్లు కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించారు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా అదే తరహా విధ్వంసం సృష్టించాలని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంటున్నారు.

April 5, 2026 / 02:18 PM IST