• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోదీ, అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు

AP: ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవం.  గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది మైలురాయి. ప్రపంచపటంలో అమరావతిని నిలుపుతాం. కేంద్రం, మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు. మద్దతు ఇచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

April 1, 2026 / 07:34 PM IST

యాదవ సంఘం కార్యదర్శిగా భాషవేని తిరుపతి

KNR: యాదవ చైతన్య వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సైదాపూర్ మండలానికి చెందిన భాషవేని తిరుపతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

April 1, 2026 / 07:32 PM IST

నార్నూరులో పర్యటించిన కేంద్ర ISO బృందం

ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం కేంద్ర ISO బృందం పర్యటించింది. ఈ సందర్బంగా వివిధ శాఖల మండల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, నూతన పాలకవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల రికార్డులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో DLPO ప్రభాకర్, ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీవో మహేష్, సర్పంచ్ బానోత్ కావేరి ఉన్నారు.

April 1, 2026 / 07:32 PM IST

వాడపల్లిలో చక్రస్నాన కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

కోనసీమ: ఆత్రేయపురం వాడపల్లి దేవస్థానంలో గురువారం జరిగే చక్రస్నాన కార్యక్రమ ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలు సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 1, 2026 / 07:31 PM IST

LSG vs DC: ఇరు జట్ల తుది జాబితా ఇదే

LSG XI: మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (C), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మోహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోకియా, ప్రిన్స్‌యాదవ్. DC XI: కేఎల్ రాహుల్, పాథుమ్ నిశ్శాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (C), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్‌దీప్ యాదవ్, టి.నజరాజన్, ముఖేశ్ కుమార్.

April 1, 2026 / 07:30 PM IST

గూడెం.. దమ్ముంటే గుట్ట మీదికి రా: కాటా

SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఎమ్మెల్యే అని విర్రవీగవద్దు.. దమ్ముంటే బీరంగూడ గుట్టపైకి రావాలి, అక్కడ నీ అవినీతి చిట్టా విప్పుతా” అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో హరీష్ రావు తీరుపై కూడా విమర్శలు చేశారు. నీ సంగతి చూస్తానంటూ ఎమ్మెల్యేకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ సవాల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

April 1, 2026 / 07:30 PM IST

సామాజిక సమానత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

కామారెడ్డి జిల్లా నర్సంపల్లిలో కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేవాలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం ద్వారా సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చారు.

April 1, 2026 / 07:30 PM IST

సబ్సిడీ యంత్రాలను అందించిన ఎమ్మెల్యే

GDWL: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గట్టు, గద్వాల మండలాలకు చెందిన 16 మంది రైతులకు సబ్సిడీ యంత్రాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనిముట్లు, ఉచిత విద్యుత్ అందించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేశామన్నారు. భవిష్యత్తులోనూ సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు.

April 1, 2026 / 07:30 PM IST

అమిత్ షా వ్యాఖ్యలపై మల్లు రవి ఫైర్

NGKL: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కమ్యూనిస్టు పార్టీలకు, మావోయిస్టులకు మధ్య ఉన్న తేడా తెలియని పరిస్థితి నెలకొందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు బుల్లెట్‌ను నమ్మలేదని బ్యాలెట్‌ను నమ్మిందని అన్నారు.

April 1, 2026 / 07:30 PM IST

హనుమాన్ మందిరంలో ఘనంగా వేడుకలు

SRCL: వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామ హనుమాన్ ఆలయంలో ఘనంగా పదవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం 9:30 గంటలకు కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 12:30 గంటలకు యజ్ఞం,1:00 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6:00 గంటలకు ప్రధాన వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

April 1, 2026 / 07:27 PM IST

IPL 2026: పంత్‌పై ఒత్తిడి.. ఈ సీజన్ సవాలే!

IPL 2026లో లక్నో సూపర్ జెయింట్స్ టైటిల్ వేటకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. అయితే, LSG కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఈ సీజన్ సవాల్‌గా మారనుంది. అతడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. LSG తరఫున 2025లో తన తొలి సీజన్‌లో పంత్ కెప్టెన్‌గా, ప్రధాన బ్యాటర్‌గా రాణించలేకపోయిన విషయం తెలిసిందే.

April 1, 2026 / 07:26 PM IST

‘ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు ఒక వరం’

JGL: ప్రభుత్వం పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బైర లక్ష్మి రాజయ్య దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇల్లు పూర్తి చేసుకుని గృహప్రవేశంలో సర్పంచ్ ఒరుగుల అరుణ శ్రీనివాస్‌తో కలిసి ఏఎంసీ ఛైర్మన్ ప్రారంభించారు.

April 1, 2026 / 07:26 PM IST

సీఎస్‌ఈగా తమీమ్ అన్సారియా బాధ్యతలు

గుంటూరు: పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా (సీఎస్‌ఈ) ఐఏఎస్ అధికారిణి తమీమ్ అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కాగా, గతంలో ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల నుంచి మంచి మన్ననలు పొందారు.

April 1, 2026 / 07:26 PM IST

అవార్డు ఉత్సవాల కార్యక్రమానికి ఛైర్మన్‌కి ఆహ్వనం

E.G: రాజమండ్రి నగరం ఆనం కళా కేంద్రంలో ఏప్రిల్ 12వ తేదీన అవార్డు ఉత్సవాల కార్యక్రమం జరుగునుంది. సానబోయిన రామారావు, రాష్ట్ర బీసీ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులు ఆనం కళా కేంద్రంలో జరగబోయే అవార్డు ఉత్సవాల కార్యక్రమానికి రుడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి కి కరపత్రం అందజేసి ఆహ్వానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 1, 2026 / 07:25 PM IST

ఈనెల 7 నుంచి రెవెన్యూ సదస్సులు

WG: పెనుమంట్ర మండలంలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిషేధిత భూముల జాబితాపై ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వై.రవికుమార్ తెలిపారు. 7న ఎస్.ఐ.పర్రు, జుత్తిగ, 8న మాముడూరు, పాలమూరు, 9న సత్యవరం, నెలమూరు, 10న వెలగలేరు, మార్టేరు సహా పలు గ్రామాల్లో ఈ సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

April 1, 2026 / 07:25 PM IST