జనగామ మండలంలోని యశ్వంతపూర్ శివారులో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఒక ఆటో రోడ్డుపై బోల్తా పడటంతో గుడ్లన్నీ చెల్లాచెదురుగా పడి పగిలిపోయాయి. ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైవేపై గుడ్లు పగిలిపోవడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.
తన ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే స్పందిస్తూ, తాను గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. ఇదంతా కేవలం ‘ఏప్రిల్ ఫూల్ ప్రాంక్’ అని, ఆ ఫొటోలు AI జనరేటెడ్ అని వెల్లడించింది. ప్రపంచ పరిస్థితుల మధ్య కాసేపు అలరించాలనే ఇలా చేశానని, తనను సీరియస్‌గా తీసుకోవద్దని కోరింది. లైఫ్‌ని చిల్ చేయాలంటూ అభిమానులకు తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు.
తన ప్రెగ్నెన్సీ వార్తలపై నటి పూనమ్ పాండే స్పందిస్తూ, తాను గర్భవతిని కాదని తేల్చి చెప్పింది. ఇదంతా కేవలం ‘ఏప్రిల్ ఫూల్ ప్రాంక్’ అని, ఆ ఫొటోలు AI జనరేటెడ్ అని వెల్లడించింది. ప్రపంచ పరిస్థితుల మధ్య కాసేపు అలరించాలనే ఇలా చేశానని, తనను సీరియస్‌గా తీసుకోవద్దని కోరింది. లైఫ్‌ని చిల్ చేయాలంటూ అభిమానులకు తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు.
WNP: ఉద్యోగుల ఐదు నెలల డిఏ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా డిమాండ్ చేశారు. జీపీఎఫ్ లోన్లు కూడా రాక ఉద్యో గులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించకుంటే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో రూ.20 లక్షల విలువైన 106 మొబైల్ ఫోన్లను ఎస్పీ నరసింహ బాధితులకు అందజేశారు. 11వ సారి ఈ మేళా నిర్వహించి రికవరీ చేసిన ఫోన్లను పంపిణీ చేశారు. ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఉంటుందని, మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే ‘CEIR’ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఈరోజు తెలిపారు.
గుంటూరు: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ పిలుపు మేరకు పొన్నూరులో అంబేద్కర్ సెంటర్‌లో ఇవాళ ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ATP: బొమ్మనహాల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇంటి వద్దే నగదు పంపిణీ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్ అందజేస్తున్నామని చెప్పారు.
AP: విభజన తర్వాత APకి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని MP పురంధేశ్వరి అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా AP ప్రస్థానం ప్రారంభమైందన్నారు. అమరావతికి భూమి ఇచ్చేందుకు 29 వేల మంది రైతులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించారు. YCP హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని.. ఆ పార్టీ అవివేకమైన నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.
NZB: చందూర్ మండల కేంద్రంలో గల ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రంలో నవజాత శిశువులకు ఇచ్చె టీకాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 108 అంబులెన్స్‌లు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందుబాటులో ఉండాలన్నారు.
ADB: గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. ఆయన బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని PHC ఆసుపత్రిని సందర్శించిన అనంతరం తాడిహత్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
BHNG: ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలోని బీసీ కాలనీలో గత కొంతకాలంగా రేషన్ దుకాణం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో నూతనంగా ఎన్నికైనటువంటి ఆలేరు ఛైర్‌పర్సన్ చొరవతో ఏర్పాటు చేసిన సబ్ రేషన్ షాప్‌లో బుధవారం 7వ వార్డు ప్రజలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజన బలమని భాస్క బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు .
AP: కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణను సాధించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితి బాధాకరమన్నారు. తెలంగాణలో ఎక్కువ ఎయిర్‌పోర్టులు రాకపోవడానికి కాంగ్రెస్, BRS ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పదేళ్లు BRS దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు.
CTR: జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈగా అమర్ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్ విభాగం ఈఈగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గత ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ మంగళవారం రిటైర్ అవ్వగా, ఆయన స్థానంలో అమర్ బాబును నియమిస్తూ సీఎండీ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
6,500 ఏళ్ల క్రితం బల్గేరియాలోని వర్ణ నెక్రోపోలిస్ ప్రాంతంలో నివసించిన ఓ వ్యక్తి, ప్రపంచంలోనే తొలిసారిగా బంగారు ఆభరణాలు ధరించినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. అతని సమాధిలో 990 బంగారు వస్తువులు లభించాయి. మానవ చరిత్రలో సామాజిక హోదాను, సంపదను ప్రదర్శించడానికి బంగారాన్ని ఉపయోగించిన తొలి ఉదాహరణగా చరిత్రకారులు దీనిని భావిస్తారు. అప్పట్లోనే ‘లగ్జరీ’ లైఫ్ రేంజ్ ఇలా ఉండేదన్నమాట!
ప్రకాశం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బోడే నాయక్ తండా సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో స్థానికులు వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం దర్శనం అనంతరం విజయనగరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.