• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

“వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టండి”

BHPL: కాటారం(M) కేంద్రం నుంచి జగ్గయ్యపల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళలో ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

April 1, 2026 / 04:22 PM IST

తెలంగాణలో గడ్డిమందు నిషేధం

TG: రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

April 1, 2026 / 04:21 PM IST

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

కృష్ణా: నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో బాలుడు బాలాజీ, వృద్ధురాలు లక్ష్మీ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసుపై దృష్టి సాధించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఇవాళ సందర్శించి, దర్యాప్తు బృందాలతో మాట్లాడారు. నిందితుల ఆచూకీ కోసం మూడు బృందాలతో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు.

April 1, 2026 / 04:20 PM IST

‘పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేయాలి’

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు, నీటి సరఫరా పనులు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో ఇటీవల మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

April 1, 2026 / 04:19 PM IST

మారుమూల గ్రామంలో కార్డన్ సెర్చ్

ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయితీ బిట్రగండ గ్రామంలో సీఐ హిమగిరి, ఎస్సై  సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసిన అనంతరం గ్రామ ప్రజలకు మహిళల భద్రత, గంజాయి నివారణ, రోడ్డు భద్రత, ఆన్లైన్ మోసాలు, నాటు సారా వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

April 1, 2026 / 04:19 PM IST

అనారోగ్యంతో ఉపాధ్యాయురాలు మృతి

 NRPT: మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన యువ ఉపాధ్యాయురాలు సునీత (25) అనారోగ్యంతో కన్నుమూశారు. ధన్వాడ మండలం మణిపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆమె, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ఎంతో భవిష్యత్తు ఉన్న సునీత అకాల మరణం అప్పంపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

April 1, 2026 / 04:17 PM IST

ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవం

SKLM: గూడెం గ్రామంలో అయ్యప్ప స్వామి జన్మ దిన మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పున్నమేశ్వరస్వామి దేవాలయంలో 50 మంది దంపతులచే అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, కలశ పూజ, నవ కలశ స్నాపనాభిషేకం, కుంకుమార్చన, అభిషేకములు, అర్చనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

April 1, 2026 / 04:17 PM IST

‘లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయి’

CTR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, కార్మికులు సాధించిన 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన బ్లాక్ డేలో భాగంగా నగరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయని చెప్పారు.

April 1, 2026 / 04:17 PM IST

అంగన్వాడి కేంద్రంలో.. ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం

NLG: చిట్యాల, సంతోష్ నగర్ అంగన్వాడీ కేంద్రం-2లో బుధవారం ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం జరిగింది. వైస్ ఛైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, గర్భవతి గుండాల పావనికి శ్రీమంతం చేసి, పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. లబ్ధిదారులందరూ ఆరోగ్యలక్ష్మి భోజనం, బాలామృతాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఎల్లయ్య, వైద్యులు, కన్వీనర్ అరుణ పాల్గొన్నారు.

April 1, 2026 / 04:17 PM IST

ఆంజనేయపురంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఎన్టీఆర్: తిరువూరు(M) ఆంజనేయ పురంలో 2025-26 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కుటుంబరావు బుధవారం ప్రారంభించారు. ఎండల తీవ్రత ఉన్నందున వడదెబ్బ తగలకుండా, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పని దినాలు పూర్తి చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఎఫ్ఏ రామారావు, టీఏ నాగమణి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

April 1, 2026 / 04:16 PM IST

అంబేద్కర్ జయంతి ఉత్సవాల గోడ ప్రతుల విడుదల

ASF: అంబేద్కర్ జయంతి ఉత్సవాల గోడ ప్రతులను ఎమ్మెల్సీ దండే విఠల్ కాగజ్ నగర్ పట్టణంలో బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను యువత ఆచరించాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. జయంతి ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 1, 2026 / 04:16 PM IST

రైలు ఢీకొని వృద్ధుడు మృతి

TPT: తడ రైల్వే స్టేషన్ ఉత్తర వైపున బుధవారం పట్టాలు దాటుతున్న గుర్తుతెలియని 65–70 ఏళ్ల వృద్ధుడిని రైలు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నై-సూళ్లూరుపేట లోకల్ ట్రైన్ సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 1, 2026 / 04:16 PM IST

‘ఎన్నిక సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి’

RR: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 4న ఇబ్రహీంపట్నంలో జరిగే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఛైర్మన్ ఎన్నిక నియామకం సజావుగా సాగాలని కోరారు.

April 1, 2026 / 04:16 PM IST

ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా నిలవాలి: MP

E.G: ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా నిలవాలని రాజమండ్రి MP పురందీశ్వరి ఆకాంక్షించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. గత YCP ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అవివేకపూరితమని విమర్శించారు. ఐదేళ్ల పాటు రాజధానిపై అనిశ్చితి నెలకొందని, అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని ఆమె గుర్తు చేశారు.

April 1, 2026 / 04:16 PM IST

PGRS పరిష్కారంలో మొదటి స్థానం మనదే: కలెక్టర్

కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు పరిష్కరించడంలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించడంలో జిల్లా యంత్రాంగం, సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.

April 1, 2026 / 04:15 PM IST