• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

CTR: చిత్తూరు జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలుతో మరియు జిల్లా అధికారులతో పరిశ్రమల ప్రమాదాల నివారణపై ముందస్తు చర్యల అమలులో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

April 1, 2026 / 08:30 AM IST

విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ (54) మృతి చెందిన ఘటన నెలకొంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సూర్యాపేట నుంచి బొప్పారం వెళ్తుండగా అచ్యుత తండా సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రామకృష్ణ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.  

April 1, 2026 / 08:30 AM IST

కొత్తపల్లిలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

KNR: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన యువకుడు కొత్త శ్రావణ్ (26) తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 1, 2026 / 08:27 AM IST

గోల్నాకలో ఈనెల 19న ‘హిందూ సమ్మేళనం’

HYD: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ హిందూ సమాజ ఐక్యత కోసం ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు గోల్నాక మార్కెట్‌లో ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిప్రసాద్, సాయిమురలి తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు.

April 1, 2026 / 08:24 AM IST

కల్తీ పాల ఘటన.. కోలుకుంటున్న చిన్నారులు

E.G: రాజమండ్రి నగరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఎం.ఆర్.ఆర్ తార్వి, డీ. రితిక్ అనే ఇద్దరు చిన్నారులు కోలుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వారు చెప్పారు.

April 1, 2026 / 08:24 AM IST

‘అందుకే NTR సినిమాను వదులుకున్నా’

NTR-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో ‘డ్రాగన్’లో తాను నటించడం లేదని మలయాళ స్టార్ టొవినో థామస్ స్పష్టం చేశాడు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన కొత్త సినిమా ‘పళ్లిచట్టంబి’ ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని, ఒకేసారి 2-3 సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు.

April 1, 2026 / 08:24 AM IST

వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు

ATP: గుత్తిలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. గుత్తి ఆర్.ఎస్ పాటు, టౌన్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు వరదనీరు రోడ్డుపై నిలుస్తున్నాయి. ఈ మార్గాన వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై వర్షపు వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

April 1, 2026 / 08:23 AM IST

అజ్ఞాతంలో ఇంకా ములుగు మావోలు

MULG: ఆపరేషన్ కగార్ గడువు ముగిసింది ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు మావోలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొందరు నేతలు తక్కళ్లపల్లి వాసుదేవరావు, బడే చొక్కారావు, కొయ్యాడ సాంబయ్య డీజీపీ ఎదుట లొంగిపోగా, పలు రాష్ట్రాలకు చెందిన 90 మందికి పైగా మావోలు ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

April 1, 2026 / 08:23 AM IST

కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

SRCL:పెన్షన్ బకాయిల సాధన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. అదికారులు స్పందించాలని కిరారు.

April 1, 2026 / 08:23 AM IST

వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయం కేసు నమోదు: CI

CTR: చిత్తూరులో వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయించడంపై రాష్ట్ర వక్స్ బోర్డు ఆడిటర్ మహ్మద్ రియాజ్ ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ CI మహేశ్వర్ నలుగురిపై కేసు నమోదు చేశారు. నగరంలోని మండీ వీధిలో ఉన్న వక్ఫ్ భూములు ఆక్రమించి, తప్పుడు పత్రాలతో విక్రయించారని, ఇందులో నలుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

April 1, 2026 / 08:20 AM IST

LSG vs DC: ఇవాళ లక్నోదే విజయమా?

లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. IPL 2026లో ఇరుజట్లకు ఇదే తొలిపోరు కాగా.. ఇందులో లక్నో గెలుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. జరిగిన 4 మ్యాచుల్లోనూ హోం టీమ్స్ గెలవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పైగా ఢిల్లీతో జరిగిన 7 మ్యాచుల్లో వరుసగా చివరి 4 గెలిచిన లక్నో జోరు మీద ఉందని చర్చించుకుంటున్నారు.

April 1, 2026 / 08:20 AM IST

‘ప్రతి కేసు దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి’

ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్, పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కేసు దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఆమె సూచించారు. పెట్రోలింగ్, డయల్ 100కు వేగంగా స్పందించాలని, అసాంఘిక కార్య కలాపాలపై నిఘా పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలన్నారు.

April 1, 2026 / 08:19 AM IST

ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు: కలెక్టర్

BHNG: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ, వార్డు సభలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చదివి వినిపించడం జరుగుతుందన్నారు.

April 1, 2026 / 08:17 AM IST

కేంద్ర కమిటీ పిలుపుతో డిపోలో ఉద్యోగుల ధర్నా

SRD: నారయణ ఖేడ్ RTC డిపోలో బుధవారం ఉదయం ఉద్యోగులు TMU కేంద్ర కమిటీ పిలుపుమేరకు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికులకు విరుద్ధంగా ఉన్నాయని దీంతో RTC ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMS) డిపో కార్యదర్శి నెహ్రూ తెలిపారు. Hire&Fire విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

April 1, 2026 / 08:17 AM IST

తిరుపతిలో 30 మందికి జరిమానా

తిరుపతిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 30 మందిపై కేసులు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ధనలక్ష్మి విచారణ జరిపి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.3లక్షల జరిమానా విధించారు.

April 1, 2026 / 08:14 AM IST