• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి నుంచి గ్రామ సభలు

JGL: నేటి నుంచి గ్రామసభలను పెద్దఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

April 1, 2026 / 06:06 AM IST

స్నేహితుడి తండ్రి చావుకెళ్లి వస్తూ.. ప్రమాదంలో మృతి

NLR: కావలిలోని స్నేహితుడి తండ్రి చావుకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కల్లూరుపల్లికు చెందిన రాజ్ కుమార్ (35) తన స్నేహితుడితో కలిసి కావలి నుంచి కొత్త వెల్లంటి వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 1, 2026 / 06:06 AM IST

బాలల హక్కులపై అవగాహన సదస్సు

PPM: కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. కనకదుర్గ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పోక్సో చట్టం, బాలల హక్కులపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

April 1, 2026 / 06:05 AM IST

‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి’

ASR: పీఎం జన్‌మన్, పీఎం అవాస్ యోజన పధకం క్రింద మంజూరయిన గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు అధికారులు వారంలో 4 కేంద్రాలను సందర్శించాలన్నారు. కార్యాలయాల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.

April 1, 2026 / 06:04 AM IST

రెండు నెలల పసి బాలుడిని అమ్ముకున్న తండ్రి

KDP: చెన్నూరు ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. మైదుకూరుకు చెందిన దండు బాలనారాయణ, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు చెందిన 2 నెలల చిన్నారిని, ఆమె తండ్రి రూ.50 వేలకు విక్రయించినట్లు లక్ష్మి తెలిపింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న తను ఆసుపత్రిలో ఉండగా, భర్త, సిబ్బంది, మరో స్థానికురాలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

April 1, 2026 / 06:04 AM IST

నేడు మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ

CTR: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి లబ్ధిదారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 16,032 వేల మంది అర్హులకు రూ. 7.12 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.

April 1, 2026 / 06:04 AM IST

నేడు రోలుగుంటలో పెన్షన్ల పంపిణీ

AKP: రోలుగుంట మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీడీవో నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. 8,793 మందికి రూ.3.72 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 138 మంది సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేస్తారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద ఉండాలని సూచించారు.

April 1, 2026 / 06:03 AM IST

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా

NLG: దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రి వద్ద ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

April 1, 2026 / 06:00 AM IST

ALERT: నేటి నుంచే కొత్త రూల్స్

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రతి ట్రాన్సాక్షన్‌కు పిన్/పాస్ వర్డ్, ఫేస్ ఐడీ లాంటివి కనీసం రెండు ఉండాలి. అలాగే ఇండియాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E-20 పెట్రోల్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. KYC చేయని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ఇకపైన కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది.

April 1, 2026 / 06:00 AM IST

గంజాయితో ముగ్గురు అరెస్టు

SKLM: పలాస కాశీబుగ్గలో గంజాయితో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పలాస రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి నుంచి 7.610 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

April 1, 2026 / 06:00 AM IST

‘ధురంధర్-2 స్టోరీ నాదే.. కాపీ కొట్టారు’

బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 సరికొత్త వివాదంలో చిక్కుకుంది. తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. 2023లోనే ఈ కథను రిజిస్టర్ చేయించాన‌ని తెలిపాడు. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించానని ఆర్ ఎస్‌ సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.

April 1, 2026 / 05:53 AM IST

మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

SRD: 2వ రోజుకు చేరిన జిన్నారం మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. దాదాపు 75 మంది మున్సిపల్ సిబ్బందికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని  జిల్లా CITU ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపమన్నారు.

April 1, 2026 / 05:51 AM IST

కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు రద్దు

ATP: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రంట్ ఆఫీసు కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంటు పోస్టుల రాత పరీక్షలను రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

April 1, 2026 / 05:48 AM IST

ఏప్రిల్ 1: టీవీలలో సినిమాలు

స్టార్ మా: జనతా గ్యారేజ్(9AM); జీతెలుగు: కలిసుందాంరా(9AM), స్పైడర్(4.30PM); ఈటీవీ: అమ్మో ఒకటో తారీఖు(9AM); జెమిని: ఒక్కడు(9AM), అన్నయ్య(3:30PM); స్టార్‌మా మూవీస్: ది గోస్ట్(9AM), సర్కారు వారి పాట(12PM), నా సామిరంగ(3PM), రాజా దిగ్రేట్(6PM), మంగళవారం(9PM); Z సినిమాలు: బ్రాండ్ బాబు(7AM), ఒంగోలు గిత్త(9AM), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(3PM), ప్రేమలు(6PM), గజకేసరి(9PM).

April 1, 2026 / 05:39 AM IST

యూట్యూబ్.. కొత్త క్రియేటర్లకు GOOD NEWS

క్రియేటర్ల కోసం యూట్యూబ్.. మానిటైజేషన్ నిబంధనలను సవరించింది. 500 సబ్‌స్క్రైబర్లు, 3వేల గంటల వాచ్ టైమ్ ఉంటే సూపర్ థాంక్స్ వంటి ఫీచర్ల ద్వారా ఆదాయం పొందవచ్చు. అయితే, ప్రకటనల ద్వారా సంపాదించాలంటే పాత నిబంధనలే వర్తిస్తాయి. ముఖ్యంగా ఏఐ (AI) కంటెంట్ వాడితే తప్పనిసరిగా వెల్లడించాలి. కాపీ చేసిన లేదా కేవలం ఏఐతో సృష్టించిన వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఇవ్వదు.

April 1, 2026 / 05:21 AM IST