బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 సరికొత్త వివాదంలో చిక్కుకుంది. తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. 2023లోనే ఈ కథను రిజిస్టర్ చేయించానని తెలిపాడు. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించానని ఆర్ ఎస్ సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.