AKP: రోలుగుంట మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీడీవో నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. 8,793 మందికి రూ.3.72 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 138 మంది సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేస్తారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద ఉండాలని సూచించారు.