ASR: పీఎం జన్మన్, పీఎం అవాస్ యోజన పధకం క్రింద మంజూరయిన గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు అధికారులు వారంలో 4 కేంద్రాలను సందర్శించాలన్నారు. కార్యాలయాల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.