• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

SRCL: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్, అనంత నగర్ 26వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డిమల్ల భాను మంగళవారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెరుమాండ్ల సంతోశ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, పాల్గొన్నారు.

April 1, 2026 / 06:15 AM IST

వైసీపీ కార్యకర్తకు అండగా ఉషశ్రీచరణ్

SS: ​రొద్దం మండల కేంద్రంలో సమస్యల్లో ఉన్న వైసీపీ కార్యకర్త కుటుంబానికి మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ భరోసా ఇచ్చారు. కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలియగానే ఆమె మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

April 1, 2026 / 06:14 AM IST

జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు దిర్సంపల్లి విద్యార్థిని ఎంపిక

VKB: దిర్సంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అక్షిత రెడ్డి జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికై అరుదైన గుర్తింపు సాధించింది. ప్రస్తుతం HYDలోని బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఖో-ఖో టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకుంది.

April 1, 2026 / 06:14 AM IST

మహిళ శక్తి పథకం మహిళల సాధికారితకు నిదర్శనం

MDCL: మహిళ శక్తి పథకం మహిళల సాధికారితకు నిదర్శనమని జిల్లా సంక్షేమ అధికారి డా. శారద తెలిపారు. మంగళవారం అల్వాల్ సఖి కేంద్రంలో నిర్వహించిన మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం, సామాజిక, ఆర్థిక స్వావలంబన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు తిరుమలదేవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 06:13 AM IST

గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అమరేందర్ రావు

PDPL: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్మూరి అమరేందర్ రావు, గుజ్జెటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కుడిది వెంకటేశ్ ఎన్నికయ్యారు. 254 ఓట్లలో 220 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అమరేందర్ రావును పలువురు లాయర్లు అభినందించారు.

April 1, 2026 / 06:13 AM IST

లంచం తీసుకుంటూ ACB చిక్కిన అధికారి

కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ACB అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ రూ.15 వేలు లంచం చేసుకుంటూ పట్టుపడ్డారు. అరవింద్ బట్టల దుకాణం ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు అతని నుంచి లంచం డిమాండ్ చేశారు. అరవింద్ ఫిర్యాదుతో రాజేంద్రప్రసాద్‌ను ACB అధికారులు పట్టుకున్నారు.

April 1, 2026 / 06:13 AM IST

బాలికపై వేధింపులు.. SPకి ఫిర్యాదు

CTR: కొంతకాలంగా తనను విలేకరి వంశీ వేధిస్తున్నాడని GD నెల్లూరు (M) మిట్ట హరిజనవాడకు  చెందిన ఓ యువతి SP తుషార్ డూడీకి ఫిర్యాదు చేసింది. సోమవారం PGRSలో ఆమె ఫిర్యాదు లేఖ అందజేసింది. ఫొటోలు మార్ఫింగ్ చేశాడని ఇతనిపై గతంలో దిశ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయిన ఎవరూ పట్టించుకోలేదని ఆమె SP వద్ద వాపోయింది.

April 1, 2026 / 06:11 AM IST

పొలంలో గుర్తుతెలియని మృతదేహం..!

NDL: ఉయ్యాలవాడ మండలం ఆర్.జంబులదిన్నె సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభించింది. మంగళవారం సుమారు 45ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై ప్రతాపరెడ్డి చేరుకుని 108లో ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 1, 2026 / 06:11 AM IST

జూబ్లీహిల్స్‌లో 300 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా

HYD: జూబ్లీహిల్స్ సొసైటీలో వరద కాలువలను పూడ్చి, ప్లాట్లుగా చేసి విక్రయించారు. అక్కడ గదులు నిర్మాణం చేయడంతో పలువురు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హైడ్రా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి గదులను క్లియర్ చేసింది. దీంతో 300 గజాల స్థలాన్ని కాపాడినట్లు చెప్పారు. అలాగే వరద కాలువను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

April 1, 2026 / 06:10 AM IST

రూరల్ PSలో డీసీపీ ఆకస్మిక తనిఖీ

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట రూరల్ పోలీస్ కార్యాలయాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సీఐ కె.లక్ష్మీనారాయణను ప్రశంసించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

April 1, 2026 / 06:10 AM IST

చికెన్ ప్రియులకు BIG SHOCK

TG: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నిరవధికంగా బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు కమిషన్ మార్జిన్‌ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ చికెన్ షాప్ యజమానుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన అద్దెలు, కరెంట్ బిల్లుల దృష్ట్యా కేజీకి రూ. 30 మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చికెన్ ప్రియులకు, హోటల్ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పవు.

April 1, 2026 / 06:09 AM IST

చీపురుపల్లి సబ్ జైలు సందర్శించిన న్యాయవాదులు

VZM: భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనేర్స్ ఏర్పాటు చేశారు. అందులో బాగంగా నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి, న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ సంయుక్తంగా చీపురుపల్లి సబ్ జైలును మంగళవారం సందర్శించారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు.

April 1, 2026 / 06:09 AM IST

లారీని ఢీ కొట్టిన ఆటో

WGL: సంగేం (M) తీగరాజుపల్లె ఫోటో తండాకు చెందిన హనుమ కృష్ణ రవి వరంగల్ కూరగాయల మార్కెట్ నుంచి ఆటోలో తిరిగి వస్తుండగా ఓంకార్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై ఉన్న లారీని ఢీ కొట్టారని స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ రోడ్డుపై వాహనం నిలపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వైద్యం నిమిత్తం MGM తరలించినట్లు తెలిపారు.

April 1, 2026 / 06:08 AM IST

నేడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్న MLA

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బుధవారం జన్నారం మండలంలో పర్యటించనున్నారు. మ. 12:30 నిమిషాలకు జన్నారం మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు CMRF చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం మ. 1:30 నిమిషాలకు జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు.

April 1, 2026 / 06:08 AM IST

నేడు మెగా వైద్య శిబిరం

KMM: చింతకాని పీహెచ్‌సీలో ఇవాళ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి అల్తాఫ్ తెలిపారు. స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్యులు, జనరల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 1, 2026 / 06:07 AM IST