KMM: చింతకాని పీహెచ్సీలో ఇవాళ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి అల్తాఫ్ తెలిపారు. స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్యులు, జనరల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.