ELR: రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్- డీ పరీక్షకు ఇచ్చే ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి నాగరాణి తెలిపారు. ఎంపికైన 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రెండు నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు