ADB: ఆదిలాబాద్ జిల్లాస్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ఈ కమిటీ ఐదుగురు సభ్యులతో ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన దివ్యాంగ అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు దరఖాస్తులను జిల్లా సంక్షేమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులను కలెక్టర్ రెండు సంవత్సరాల కాలానికి నియమిస్తారని తెలిపారు.