MLG: వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామంలోని అక్రమ ఇసుక ర్యాంపును వెంటనే నిలుపుదల చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వాసు డిమాండ్ చేశారు. ఇవాళ MRO వేణుగోపాల్‌కు CPM నేతలు వినతి పత్రం అందజేశారు. ఒక సర్వే నంబర్లోని 34.35 గుంటల రెవెన్యూ భూమికి అధికారులు లంచాలకు లొంగి అక్రమంగా పట్టాలు సృష్టించి ర్యాంపుకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.