బజాజ్ తన పాపులర్ మోడల్స్ పల్సర్ NS400Z, డామినార్ 400 స్థానంలో 350cc వెర్షన్లను ఈ నెలలో విడుదల చేయనుందట. ట్రయంఫ్తో కలిసి 350cc శ్రేణిని తీసుకొస్తున్న తరుణంలో, ‘పల్సర్ NS350Z’, ‘డామినార్ 350’ మార్కెట్లోకి రానున్నాయి. పాత 400cc మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. ఆకర్షణీయమైన ధరలతో రానున్న ఈ బైక్లు వాహన ప్రియులను ఆకట్టుకోనున్నాయి.