ADB: ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద బుధవారం ఉదయం వినియోగదారులు పోటెత్తారు. గ్యాస్ కొరత ఉందన్న పుకార్లతో ఉదయం నుంచే క్యూకట్టారు. ప్రజలు మాట్లాడుతూ.. బుకింగ్, డెలివరీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోయారు. అయితే జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.