అనంతపురంలోని 17, 26, 42వ డివిజన్లలో అర్హులైన లబ్ధిదారులకు బుధవారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి నేతృత్వంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక భరోసాను వారి గడప వద్దకే చేర్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె తెలిపారు.