MBNR: గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ పై సామాజిక మాధ్యమాలలో అనుచిత పోస్టులు చేసిన నేపథ్యంలో కొంతమంది యువకులపై కేసు నమోదు చేసినట్టు రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. వారిలో ఒక యువకుడిని బైండోవర్ చేసామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలను కులాలను వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు.