ఉమ్మడి ప.గో జిల్లాలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలు కేటాయిస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారని ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఏప్రియల్ 21 సాయంత్రం 5 లోపు 18-52 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు http: //eluru.ap.gov.in వెబ్సైటును పరిశీలించాలన్నారు.