NGKL: బీజేపీ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యకర్తలు సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WNP: పట్టణంలో ఏర్పాటు చేసిన “బచ్ పన్” పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు విలువలతో కూడిన చదువు, సంస్కారం, తల్లిదండ్రులపై భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యాబోధన చేయాలన్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను రాణించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలంలో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి గ్రామపంచాయతీల పన్నుల్లో 60 శాతం వసూళ్లు సాధించినట్లు ఎంపీడీవో సునీల్ తెలిపారు. రూ.30.80 కోట్లలకు గాను, రూ.18.50 కోట్లు వసూలయ్యాయని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన వసూళ్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. తొర్రేడు గ్రామంలో 100 శాతం పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.
MBNR: 2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాజమాన్యాలు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
KRNL: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు మంగళవారం కలిశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, జిల్లాలో గనుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జిల్లాకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రవీందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ లో జెడ్పిహెచ్ఎస్ నూతనకల్ 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పోలీస్, చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని నూతనకల్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. సమస్యల మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు పిటిషన్ ఎలా ఇవ్వాలి, ఎఫ్‌ఐఆర్ ఎలా చేస్తారు, ఎంక్వయిరీ ఎలా చేస్తారు వంటి అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ELR: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది.
SRCL: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్, అనంత నగర్ 26వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డిమల్ల భాను మంగళవారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పెరుమాండ్ల సంతోశ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, పాల్గొన్నారు.
SS: రొద్దం మండల కేంద్రంలో సమస్యల్లో ఉన్న వైసీపీ కార్యకర్త కుటుంబానికి మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ భరోసా ఇచ్చారు. కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం తెలియగానే ఆమె మంగళవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
VKB: దిర్సంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అక్షిత రెడ్డి జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికై అరుదైన గుర్తింపు సాధించింది. ప్రస్తుతం HYDలోని బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఖో-ఖో టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకుంది.
MDCL: మహిళ శక్తి పథకం మహిళల సాధికారితకు నిదర్శనమని జిల్లా సంక్షేమ అధికారి డా. శారద తెలిపారు. మంగళవారం అల్వాల్ సఖి కేంద్రంలో నిర్వహించిన మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం, సామాజిక, ఆర్థిక స్వావలంబన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు తిరుమలదేవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
PDPL: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్మూరి అమరేందర్ రావు, గుజ్జెటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కుడిది వెంకటేశ్ ఎన్నికయ్యారు. 254 ఓట్లలో 220 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అమరేందర్ రావును పలువురు లాయర్లు అభినందించారు.
కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ACB అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ రూ.15 వేలు లంచం చేసుకుంటూ పట్టుపడ్డారు. అరవింద్ బట్టల దుకాణం ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు అతని నుంచి లంచం డిమాండ్ చేశారు. అరవింద్ ఫిర్యాదుతో రాజేంద్రప్రసాద్‌ను ACB అధికారులు పట్టుకున్నారు.
CTR: కొంతకాలంగా తనను విలేకరి వంశీ వేధిస్తున్నాడని GD నెల్లూరు (M) మిట్ట హరిజనవాడకు చెందిన ఓ యువతి SP తుషార్ డూడీకి ఫిర్యాదు చేసింది. సోమవారం PGRSలో ఆమె ఫిర్యాదు లేఖ అందజేసింది. ఫొటోలు మార్ఫింగ్ చేశాడని ఇతనిపై గతంలో దిశ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయిన ఎవరూ పట్టించుకోలేదని ఆమె SP వద్ద వాపోయింది.