• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం

W.G: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి డీఎస్పీలకు సూచించారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి 15 వరకు జిల్లాలో మొత్తం 18 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

April 1, 2026 / 06:32 AM IST

ప్రాణదాత ‘ట్యాంక్‌బండ్ శివ’కు CM చేయూత

HYD: హుస్సేన్ సాగర్‌లో వందలాది ప్రాణాలను కాపాడిన ‘ట్యాంక్ బండ్ శివ’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి భారీ సాయం ప్రకటించారు. శివ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని నిన్న అందజేశారు. అదనంగా శివకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉపాధి కోసం ట్యాంక్ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలన్నారు.

April 1, 2026 / 06:32 AM IST

స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

WGL: 2025-26 విద్యాసంవత్సరానికి వరంగల్ జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న SC, ST, BC, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థులు తెలంగాణ ఈ పాస్వర్డ్ వెబ్‌సైట్ లో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

April 1, 2026 / 06:31 AM IST

తిరుపతిలో వ్యభిచారం.. పోలీసుల దాడులు

TRPT: పద్మావతి నగర్, ఎస్బీఐ బ్యాంక్ కాలనీలోని వ్యభిచార గృహంపై తిరుచానూరు పోలీసులు మంగళవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ముగ్గురు మహిళలతో పాటు ఓ విటుడు, వ్యభిచార గృహం నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడి చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

April 1, 2026 / 06:31 AM IST

ఒంటిమిట్టలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

KDP: ఒంటిమిట్టలో జరిగే కళ్యాణానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా రేంజ్ కోయ ప్రవీణ్ సూచించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్, SP నచి కేత్‌తో కలిసి కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు పలు సూచనలు అందజేశారు.

April 1, 2026 / 06:30 AM IST

ఖాళీ  కడుపుతో ఖర్జూరం తింటే..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి అంతా నీటిలో నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

April 1, 2026 / 06:25 AM IST

బుధవారం: తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మొత్తం 73,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం సుమారు ₹4.30 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి (SSD టోకెన్లు లేకుండా) సుమారు 8 గంటల సమయం పడుతోంది.

April 1, 2026 / 06:25 AM IST

బుధవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మొత్తం 73,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం సుమారు ₹4.30 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి (SSD టోకెన్లు లేకుండా) సుమారు 8 గంటల సమయం పడుతోంది.

April 1, 2026 / 06:25 AM IST

చెట్టంటే తల్లి.. అలాగే చూడండి, పెంచండి: VC

KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థలపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. శాతవాహన విశ్వవిద్యాలయం VC ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ చెట్లు నాటాలని కోరారు. ఆ చెట్టును తల్లిలాగా భావించి తల్లిని చూసుకున్నట్టుగా చెట్టును కాపాడుకోవాలని సూచించారు.

April 1, 2026 / 06:25 AM IST

కళాజాత ప్రదర్శన ద్వారా సైబర్ మోసాలపై అవగాహన

ASF: లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామంలో నూతన పోలీస్ చట్టాలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత ప్రదర్శన నిర్వహించారు. SP నితికా పంత్ ఆదేశాల మేరకు, ASP చిత్తరంజన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగినట్లు SI చెంచు గంగన్న తెలిపారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులకు ఆధార్ వివరాలు, OTP లు చెప్పి మోసపోవద్దని సూచించారు.

April 1, 2026 / 06:24 AM IST

నేడు జగన్ మీడియా సమావేశం

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం జరగనుంది.

April 1, 2026 / 06:24 AM IST

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు

KMR: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నాగిరెడ్డిపేట మండల పరిధిలోని గోలీలింగాల, గోపాల్‌పేట్ గ్రామాలలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు సేఫ్టీ అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. 

April 1, 2026 / 06:22 AM IST

డోర్నకల్‌లో ARRIVE AND ALIVE కార్యక్రమం

MHBD: 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో మంగళవారం రాత్రి కౌన్సిలర్ సువర్ణ-హరికృష్ణ ఆధ్వర్యంలో SI ఉమా నేతృత్వంలో ARRIVE AND ALIVE రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా, రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.

April 1, 2026 / 06:22 AM IST

‘టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి’

NGKL: బీజేపీ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్యకర్తలు సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 1, 2026 / 06:20 AM IST

నూతన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: పట్టణంలో ఏర్పాటు చేసిన “బచ్ పన్” పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు విలువలతో కూడిన చదువు, సంస్కారం, తల్లిదండ్రులపై భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యాబోధన చేయాలన్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను రాణించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

April 1, 2026 / 06:19 AM IST