KRNL: నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. ‘ఏపీ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30’లో భాగంగా జిల్లాలో పారి శ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్ సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. https://investandhra.ap.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు.
SDPT: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ కులదేవత శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ సింహద్వార రోహణం, దర్వాజా ముహూర్తం శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ఇంటింటి నుంచి బిందెలతో నీళ్లు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు తీసుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం సందడి నెలకొంది.
మంచిర్యాలలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో డే వాచ్ మెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీస్ బోర్డుపై ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 4 సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకోవాలని సూచించారు.
SRD: మద్యం తాగి వాహనాలు నడపొద్దని సిర్గాపూర్ ఎస్సై మహేష్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సిర్గాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై వాహనాలను నిదానంగా నడిపి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.
KNR: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 శిక్షణా తరగతులు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల కర్తవ్యాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో బొమ్మకల్ నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కార్పొరేటర్ మ్యకల వెంకటేష్, రైల్వే బోర్డు సభ్యులు పాశం తిరుపతి, అసిరి తిరుపతి ఆధ్వర్యంలో నాయకులు శిక్షణలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ధర్మపురికి చెందిన సంఘనబట్ల దినేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యోగితా రాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్లకు దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలకు కృషి చేస్తానన్నారు.
MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి బాలానగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. బైక్‌పై వెళుతున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
TG: మహబూబ్ నగర్‌లో రైల్వే డబుల్ లైన్ పనుల వల్ల పెదాలు ఇళ్లు కోల్పోతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపేదలు రోడ్డున పడుతున్నారని, విద్యుత్ నిలిపివేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బాధితుల తరఫున ఢిల్లీకి వెళ్లైనా పోరాటం చేస్తామని పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
SRCL: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి శరీరం ముక్కలు ముక్కలైన ఘటన సిరిసిల్ల పరిధిలోని పెద్ద బోనాల వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద బోనాల వద్ద దానవిని నర్సవ్వ అనే వృద్ధురాలని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరం ముక్కలు ముక్కలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: మోస్రా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
MBNR: హన్వాడ మండలం టంకర గ్రామంలో ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో NSS వేసవి శిబిరం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు సాగనున్న ఈ శిబిరంలో సామాజిక అవగాహన, పరిశుభ్రత, పచ్చదనం, ప్రభుత్వ పథకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కలమ్మ, మార్కండేయ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారత గూఢచారి రవీంద్ర కౌశిక్ ఎందరికో స్ఫూర్తిదాయకం. RAW ఏజెంట్‌గా పాకిస్తాన్ వెళ్లి, నబీ అహ్మద్ షాకిర్‌గా మారి పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారత్‌కు కీలక సమాచారాన్ని అందిస్తూ 1983లో దొరికిపోయారు. పాక్ జైలులో చిత్రహింసలు అనుభవిస్తూ 2001లో మరణించారు. ఆయన సాహసానికి మెచ్చిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ బిరుదు ఇచ్చారు.
NGKL: పెంట్లవెల్లి మండలం గోపులాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీని ఎంపీడీవో నాగేంద్రం, ఏపీవో మోహన్ కృష్ణ శనివారం పరిశీలించారు. నర్సరీలోని మొక్కలను ఎండల నుంచి సంరక్షించేందుకు వెంటనే షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్థులకు ఉపయోగపడే పండ్ల, పూల మొక్కలను అధికంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మండల తహశీల్దార్ రజనీకుమారి స్పష్టం చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్యాస్ పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా కమీషన్ల కోసం వినియోగదారులను ఇబ్బంది పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
SDPT: రాయపోల్ మండలం వడ్లపల్లిలో గ్రామదేవత పోచమ్మకు భక్తులు బోనాలను సమర్పించారు. సంప్రదాయబద్ధంగా మహిళలు తలపై బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, డప్పుల వాయిద్యాలతో సందడి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.