SRPT: లారీ యజమానులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలను నిరసిస్తూ, రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ కోదాడలో శనివారం నిరసన తెలిపింది. రేడియం స్టిక్కర్ల పేరిట వేల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
KMR: ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ వేడుకలో శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధుల్లో ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు.
NTR: కంచికచర్ల పట్టణం పరిధిలోని మిక్ కాలేజీ సమీపంలో ఆదివారం వేకువజామున అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లారీ.. వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు.
NZB: శ్రీనిధి 2024-25 వార్షిక మహాసభలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీవో సాయి గౌడ్ పురస్కారం అందుకున్నారు. రూ.216 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రుణాల రికవరీలో జిల్లా అగ్రస్థానం సాధించింది. ఈ వేడుకలో కమ్మర్‌పల్లి మండల సమైక్యకు కూడా అవార్డు అందజేశారు.
KDP: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి, ఆర్.శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ కూడలిలో జెండా ఆవిష్కరణ, 10:00 గంటలకు కళాక్షేత్రం వద్ద చాయ్ రాస్తా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు బాణాసంచా పేల్చరాదని అధికారులు సూచించారు. పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యవర్గం పిలుపునిచ్చింది.
MDK: అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రేణుక రెడ్డి, ఎస్సై శంకర్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర ప్రశాంతంగా సాగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
WGL: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉమ్మడి వరంగల్ రీజనల్ మేనేజర్‌గా సోమరాజు భవానీ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్ఎం విజయ భానును ఆదిలాబాద్ జిల్లా ఆర్ఎంగా బదిలీ చేశారు. భవానీ ప్రసాద్ 2013-14లో వరంగల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా సమర్థవంతంగా సేవలందించారు.
అన్నమయ్య: జిల్లాలో 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుండుపల్లెను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. వీరబల్లి, కె.వి.పల్లె, యర్రావారిపాలెం మండలాలతో కలిపి సుండుపల్లె కేంద్రంగా రూపొందే అవకాశం ఉందని సమాచారం. దీంతో పలు రాజకీయ కుటుంబాలు, కొత్త నాయకులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నారాయణపేట జిల్లాలో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలపై కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో జరుగుతున్న కార్యక్రమాల అమలు, వాటి ప్రభావం, నాణ్యతా ప్రమాణాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎన్.చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో కొణిదల నాగబాబు సమక్షంలో పార్టీ కండువా ధరించారు. ఆయన చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరికతో జనసేన పార్టీ కార్యకలాపాలు నియోజకవర్గంలో మరింత వేగవంత కానున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సరండి రోడ్డు వద్ద SI మహేందర్ శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్వి చక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
PDPL: మంథని మునిసిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మురుగు కాలువల శుభ్రం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ పెంటరి రాజు స్వయంగా మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ క్లీనింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోతుల సమస్యపై కూడా నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.
NGKL: అచ్చంపేటలో రోడ్ల ఆక్రమణలపై మున్సిపాలిటీ కఠిన చర్యలు చేపట్టింది. శనివారం లింగాల రోడ్డులో అక్రమంగా నిర్మించిన షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆక్రమణలను ఏమాత్రం సహించబోమని, పట్టణ అభివృద్ధికి అడ్డుపడితే చర్యలు తప్పవని కమిషనర్ డి.మురళి హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించుకోవాలని, లేనిపక్షంలో కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
మెదక్ పట్టణంలో శ్రీ కోదండ రామాలయం రథోత్సవం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో రథోత్సవంతో ముగిశాయి. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ముందుకు రథాన్ని ముందుకు లాగారు. ఆలయం ముందు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథం లాగారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ నినాదాలు చేశారు.
KRNL: నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. ‘ఏపీ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30’లో భాగంగా జిల్లాలో పారి శ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్ సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. https://investandhra.ap.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు.