• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తిరుమలలో 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వసంతోత్సవాల సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ కోరింది.

March 29, 2026 / 06:10 AM IST

‘రూ.240 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు’

W.G: గోదావరి పుష్కరాలకు నరసాపురంలో సుమారు రూ.240 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు మున్సిపల్ ఆర్డీ సీహెచ్.నాగ నరసింహరావు తెలిపారు. శనివారం నరసాపురం గోదావరి ఏటిగట్టును ఆయన పరిశీలించారు. ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించామన్నారు. అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు చేపడతామని ఆయన తెలిపారు.

March 29, 2026 / 06:08 AM IST

ఆర్టీసీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: కేంద్ర ప్రభుత్వ PMKVY 4.0తో పాటు రాష్ట్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా RGM ప్రభుత్వ ITIలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్, శిక్షణాధికారి విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. CNC టర్నింగ్, 3D ప్రింటింగ్‌తో పాటు ATC కింద15 రోజుల ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు పూర్తయిన దరఖాస్తు చేసుకోవన్నారు.

March 29, 2026 / 06:08 AM IST

వ్యక్తిపై దాడి.. కేసు నమోదు

వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పట్టణంలోని జంగాల గుట్టకు చెందిన మండ్ల వెంకటేష్‌పై అతని బామ్మర్ది గుజ్జుల ఎల్లయ్య శుక్రవారం నాగవరం కల్లు దుకాణం వద్ద అకారణంగా గొడవపడి, కల్లు సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్ రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 06:06 AM IST

పలు ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

BDK: భద్రాచలంలో ఉన్న జాబిల్లి హాస్పిటల్, రాధ హాస్పిటల్లను DMHO డా.తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన డీఎంహెచ్‌వో ఆసుపత్రి యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. రోగుల సౌకర్యార్థం సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు.

March 29, 2026 / 06:06 AM IST

క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ క్రీడా వేడుకల్లో మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన క్రీడాస్ఫూర్తిని చాటారు. ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీల్లో పాల్గొని అందరిని అలరించారు.

March 29, 2026 / 06:03 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

NLR: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 29, 30వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి మనోహర్ 29వ తేదీ రాత్రి 10 గంటలకు నెల్లూరుకు చేరుకొని బస చేస్తారు. అనంతరం 30వ తేదీన కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తారు. తదుపరి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షలో పాల్గొంటారని పలువురు అధికారులు తెలిపారు.

March 29, 2026 / 06:03 AM IST

గోవుల అక్రమ రవాణా.. కేసు నమోదు

WGL: వర్ధన్నపేట పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు ఆవులను వధశాలకు తీసుకెళ్తుండగా బృందం అడ్డుకుని తనిఖీ చేసింది. అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

March 29, 2026 / 06:03 AM IST

విద్యుత్తు సరఫరాలో నేడు అంతరాయం

నల్గొండ పట్టణంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సంస్థ ఏడీఈ వేణుగోపాలచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, భారత్ గ్యాస్ గోదాం ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని వివరించారు. ఈవిషయం గుర్తించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

March 29, 2026 / 06:02 AM IST

శ్రీశైలం దేవస్థానంలో దేవాదాయ శాఖ అధికారి

NDL: దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డా. యం.హరి జవహర్ లాల్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.

March 29, 2026 / 06:02 AM IST

జిల్లాలో CM పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

ADB: బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు CM బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి చేరుకుని సభలో ప్రసంగిస్తారు.

March 29, 2026 / 06:02 AM IST

రేడియం స్టిక్కర్ల విధానంపై లారీ యజమానుల ఆగ్రహం

SRPT: లారీ యజమానులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలను నిరసిస్తూ, రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ కోదాడలో శనివారం నిరసన తెలిపింది. రేడియం స్టిక్కర్ల పేరిట వేల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

March 29, 2026 / 06:01 AM IST

ఎల్బీ స్టేడియంలో క్రీడా వేడుక.. ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరు

KMR: ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ వేడుకలో శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధుల్లో ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు.

March 29, 2026 / 06:00 AM IST

కంచికచర్లలో అదుపుతప్పి లారీ బోల్తా

NTR: కంచికచర్ల పట్టణం పరిధిలోని మిక్ కాలేజీ సమీపంలో ఆదివారం వేకువజామున అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లారీ.. వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు.

March 29, 2026 / 06:00 AM IST

శ్రీనిధిలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానం

NZB: శ్రీనిధి 2024-25 వార్షిక మహాసభలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీవో సాయి గౌడ్ పురస్కారం అందుకున్నారు. రూ.216 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రుణాల రికవరీలో జిల్లా అగ్రస్థానం సాధించింది. ఈ వేడుకలో కమ్మర్‌పల్లి మండల సమైక్యకు కూడా అవార్డు అందజేశారు.

March 29, 2026 / 06:00 AM IST