MHBD: బయ్యారం మండలంలోని కస్తూరినగరం, రామచంద్రపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని సూచించారు. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
AP: మైనింగ్‌పై విచారణను స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. 2024లో అసెంబ్లీ సాక్షిగా ORR టెండర్‌పై నియమించిన SIT విచారణ ఏమైందని నిలదీశారు. అసెంబ్లీలో ప్రకటనలకే పరిమితమై ఆచరణలో చర్యలు లేకపోతే ప్రజలు అంగీకరించరని తెలిపారు. కేరళ, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయని నిధుల సేకరణకు అసెంబ్లీని వేదికగా వాడుతున్నారా? అని ప్రశ్నించారు.
SDPT: చేర్యాల మండలం ఆకునూరులో ఎంపీవో, సర్పంచ్ కొమ్ము రవి ఆధ్వర్యంలో శనివారం తైబజార్, 7 షెటర్లకు బహిరంగ వేలం నిర్వహించారు. తైబజారును అందె నానిబాబు రూ.54,500లకు దక్కించుకోగా, షెటర్ల వేలం ద్వారా మొత్తం రూ.3,70,500 ఆదాయం సమకూరింది.గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న షెటర్ల వేలం ప్రక్రియను ప్రస్తుత సర్పంచ్ విజయవంతంగా పూర్తి చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీలో మంచినీటి సమస్యను సర్పంచ్ శాంతి శ్రీ త్వరితగతిన పరిష్కరించారు. గత 2 రోజులుగా పైపులైన్ మరమ్మతుల వల్ల నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, శనివారం స్వయంగా వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లి పరిశీలించారు.
ASR: దుంప జాతి పంటల ప్రాముఖ్యత, వినియోగంపై భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త డా. మురుగేశన్ గిరి రైతులకు అవగాహన కల్పించారు. శనివారం డుంబ్రిగుడ(M) గసభ గొందివలస గ్రామంలో దుంప జాతి పంటల పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేరళ నుంచి తెచ్చిన కొత్త రకాల దుంపలను రైతులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసన్ సంస్థ ప్రతినిధులు నరసింగరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.
GDWL: గ్రామంలో మౌలిక వసతుల కల్పనే తన లక్ష్యమని కొత్తపల్లి సర్పంచ్ సురేశ్ అన్నారు. శనివారం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి దశలవారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి జయన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని మండల తాహసిల్దార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరుగుతున్న పాలనా విషయాలపై ఆరా తీశారు.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (80) సెంచరీ మిస్ చేసుకున్నాడు. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో (15.6) ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. బౌండరీ వద్ద సాల్ట్ సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో 155 పరుగుల వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది.
AP: రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. గ్రామస్థాయికి బీజేపీ విస్తరణే లక్ష్యమన్నారు. ఏపీ బీజేపీ టీమ్ యాక్టివ్‌గా పని చేస్తోందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని వ్యాఖ్యానించారు. జగన్‌ను బీజేపీ కాపాడుతుందనడం అసత్యమని స్పష్టం చేశారు. మోదీ- జగన్ సంబంధాలపై ప్రచారం నిరాధారమని పేర్కొన్నారు.
ATP: కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం సమీపంలోని ఏపీఐఐసీ భూములను శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్ట్రో బేస్ సంస్థ కార్యకలాపాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంఎస్ఎంఈ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దిశానిర్దేశం చేశారు.
అన్నమయ్య: జిల్లా పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు సహచరులు అండగా నిలిచారు. హోంగార్డులు స్వచ్ఛందంగా తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా సమీకరించి, జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందజేశారు. మొత్తం రూ.6.78 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు అందింది.
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డోన్ లీగల్ మెట్రాలజీ అధికారి నాగరాజు ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో కాటాలను పరిశీలించారు. తప్పుడు తూకాలతో వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని లైసెన్సులు తప్పక కలిగి ఉండాలన్నారు.
E.G: ఏపీ షెడ్యూల్డ్ తెగల (ST) కమిషన్ సభ్యులు కె.మల్లేశ్వరరావు, కె.లక్ష్మి శనివారం రాజమండ్రిలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కారాగార పర్యవేక్షణాధికారి వారికి స్వాగతం పలికి కమిషన్ సభ్యులకు కారాగారంలోని వివిధ విభాగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలను, ఆహార సదుపాయాలను పరిశీలించారు.
KNR: కరీంనగర్ భగత్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా సాగింది. చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠం అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్ సునీత అన్నారు. ప్రతి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులు పరిష్కారం చేసుకోవచ్చు అని తెలిపారు.