AP: ఇతర ప్రాంతాల బోట్లు ఏపీ సముద్ర జలాల్లోకి రాకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మత్స్యకారుల సమస్యలను సీఎంకు సోమిరెడ్డి విన్నవించారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్ల వల్ల ఏపీ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని సోమిరెడ్డి తెలిపారు.
GDWL: జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదుతో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించిందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,73,707 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇప్పటికే 1,64,603 ఎకరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మిగిలి ఉన్న 9,104 ఎకరాల నమోదును ఈ నెల 30లోగా చెయ్యాలన్నారు.
సత్యసాయి: నల్లమాడ మండల కేంద్రంలో శనివారం చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీవో అంజినప్ప వాహనాలకు పూజలు నిర్వహించి, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నల్లమాడ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారంగా నిలబడి స్వర్ణాంధ్ర–స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
TG: జైన మతంలోని శ్వేతాంబర, దిగంబరలకు అత్యంత ముఖ్యమైన మహావీర్ జయంతిని ఈనెల 31న జరగనుంది. భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణక్ మహోత్సవాన్ని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులతో కూడిన శోభాయాత్ర చేయనున్నారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
AKP: నర్సీపట్నంలో పర్యటిస్తున్న ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాలికలతో కలిసి భోజనం చేశారు. గురుకుల పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలుంటే తమకు తెలియజేయాలని సూచించారు. మంచి ఉత్తీర్ణత శాతం తెచ్చుకోవాలని బాలికలకు సూచించారు.
NLR: దగదర్తి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై శనివారం ఏపీడీ స్వరూప్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సామాజిక తనిఖీలో జరిగిన అవకతవకలలో రూ.13,20,419లకు గాను రూ. 2,10,363 రికవరీ చేశారు. మిగిలిన రూ.11,10,056 రికవరీ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో “మనబడి మన భవిష్యత్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 13 తేదీ నాటికి పనులు పూర్తి చేయాలన్నారు.
KNR: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు రజిత, రాధతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లోని PGRS సమావేశ మందిరంలో పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులని తెలిపారు.
IPL 2026 సీజన్‌లో భాగంగా RCB, SRH మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ క్రీజులోకి వచ్చారు. జాకబ్ డఫీ బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. అంతకుముందు క్రికెటర్లు, అభిమానులు గత సీజన్‌లో RCB విజయోత్సవ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు.
కడప జిల్లా బద్వేలు బైపాస్ రోడ్‌లో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం సమయంలో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
AP: మాజీ సీఎం జగన్ రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్‌కు బిల్‌గేట్స్‌ని తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మహిళా రైతులపై వైసీపీ నేతలు కేసులు బనాయించారని తెలిపారు. రైతులు భూములే కాదని.. ప్రాణాలు కూడా ఇస్తామంటూ నిలబడ్డారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అమరావతికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.
CTR: పుంగనూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. సంఘం అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది విజయ్ కుమార్, కార్యదర్శిగా అరవింద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా గురుమూర్తి ఎన్నికయ్యారు. గెలుపొందిన వారిని తోటి న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
TPT: శ్రీకాళహస్తి పట్టణ ప్రాంత మహిళల కోసం ‘చాయ్ రాస్తా’ పథకం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను, స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి డ్వాక్రా (DWACRA) మహిళా సభ్యులు అర్హులు. మెప్మా ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు, బ్యాంక్ రుణం, సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ పథకం కింద సుమారు 75% నుంచి 90% వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
NLG: గుర్రంపోడ్ మండలం కొప్పోలులో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. శ్రీరామనవమి మరుసటి రోజున కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకకు గ్రామస్థులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రామనామస్మరణతో గ్రామం పులకించిపోగా, ఆలయం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.