W.G: ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇంఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
SRPT: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, నివాస కాలనీలలో గుంపులుగా తిరుగుతూ స్థానికులను తీవ్రంగా భయపెడుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.
MNCL: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యారియా కేటాయింపుల్లో పక్షపాతం చూపిస్తుందని CPM మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి సోమవారం ప్రకటనలో తెలిపారు. రాజకీయ ఎత్తుగడలతోనే జిల్లాకు సరిపడ యూరియా సప్లై చేయడం లేదన్నారు. రైతులకు ఎంత యూరియా అవసరమో వ్యవసాయాధికారులు అంచనా వేసినా కేంద్రం యూరియా కేటాయింపుల్లో వ్యత్యాసం చూపిస్తుందన్నారు.
MLG: మంగపేట(M) కమలాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబం శిథిల ఇంట్లో నివసిస్తోంది. ఆరుగురు సభ్యుల ఈ కుటుంబం వర్షం పడితే నీళ్లు ఇంట్లోకి చేరే సమస్యను ఎదుర్కొంటోంది. గ్రీవెన్స్‌లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుకు అర్హతలు ఉన్నాయని, ఎంక్వయిరీ చేసి ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు.
AP: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను మంత్రి లోకేష్ విడుదల చేశారు. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని అందుబాటులో ఉంచారు. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు.
కృష్ణా: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో సోమవారం పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల మాసోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు. వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయనతో పాటు సర్పంచ్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
KMM: నేలకొండపల్లిలోని అప్పలనరసింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటైంది. గ్రామంలోని చెరువుకు సొసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని వారు గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖను గుర్తించి, గ్రామానికి చెందిన 64మందికి సభ్యత్వంను ఇచ్చారు. కొత్తసొసైటీ ఏర్పాటుపై ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు.
MNCL: చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన జాడి వెంకటి మృతదేహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం నివాళులర్పించారు. గత 30సంవత్సరాలుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన మృతితో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
VKB: తాండూరు మండలం నారాయణపూర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వారం రోజులుగా గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కాగా, గ్రామానికి తాగునీటి సరఫరా కోసం మోటార్లు పనిచేస్తుండేవి. అయితే ప్రస్తుతం అవి పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించాలని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
NZB: కోటగల్లి పద్మశాలి వసతిగృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఎన్నికల్లో 205 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. యాదగిరికి 441 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి సత్యపాల్కి 236 ఓట్లు వచ్చాయి. యాదగిరితో పాటు అతని ప్యానెల్లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
PLD: బొల్లాపల్లి మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది భాస్కర్ రావు, కొండలు, సంజన భాయ్ పాల్గొని మాట్లాడుతూ.. పశువులకు సకాలంలో టీకాలు వేయించుకుని వ్యాధులు నుంచి రక్షించుకోవాలని రైతులకు సూచించారు.
NLG: మాజీ ఎంపీ బృందాకారత్ ఈ నెల 17న నల్గొండకు రానున్నారు. క్లాక్ టవర్ సెంటర్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభలో ఆమె పాల్గొంటారని సీపీఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు తెలిపారు. సుమారు 3 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
GDWL: రాజోలి మండలం తూర్పు గార్లపాడు శివారులో కరెంటు షాక్‌కు గురై మరణించిన యువరైతు శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఇవాళ రైతు స్వగ్రామం తుమ్మలపల్లికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ELR: నూజివీడు మండలం పడమట దిగవల్లి గ్రామంలోని కేఎంఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ కిషోర్, కరస్పాండెంట్ జి వెంకట గోపాలరావులకు గుంటూరులో పాన్ ఇండియా ఐకాన్ టీచర్స్ అవార్డ్స్ లభించడం పట్ల పలువురు విద్యావేత్తలు సోమవారం అభినందనలు తెలిపారు. ఏపీ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది.
WGL: సంగెం మండలం ఏలూరు స్టేషన్ గ్రామంలోని గుట్ట చుట్టూ మొరం దందాను అరికట్టాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు సపావట్ మహేందర్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అక్రమంగా మొరం దందా చేస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.