KRNL: నందవరం మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వందల మంది వైరల్ ఫీవర్తో వస్తున్నారని చెప్పారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో మురుగు కాల్వలు శుభ్రం కాక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ADB: భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గ్రామాలైన గుంజాల, రాజుల్వాడి, లీముగూడ, బుర్కపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బంది మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బీపీ, రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
CTR: చిత్తూరులోని కస్తూర్భా బాలికల నగర పాలకోన్నత పాఠశాల విద్యార్థినిలు మంగళవారం ఓజోన్ డే అవగాహన ర్యాలీని నిర్వహించారు. హెచ్ఎం రమాదేవి విద్యార్థినిలకు ఓజోన్ పొర ప్రాముఖ్యతను వివరించారు. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత హానికరమైన కిరణాలనుంచి ఓజోన్ పొర జీవరాసులను రక్షిస్తుందన్నారు. ఈ పొర రోజు రోజుకి క్షీణిస్తోందన్నారు.
ELR: ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్‌కు దేశంలోనే 2వ స్థానం సాధించిన సందర్భంగా ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులుని భీమడోలులో మంగళవారం చింతలపూడి, పోలవరం సొసైటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని కోరారు. అలాగే గోడౌన్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ELR: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కాటికాపర్ల సంఘం వారు కలిశారు. స్మశాన కార్మికుల్ని నాలుగో తరగతి ఉద్యోగులకు గుర్తించి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. స్మశాన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఫ్రాన్సిస్ కోరారు. అలాగే పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు
ELR: జంగారెడ్డిగూడెం డివిజనల్ పంచాయతీ అధికారిగా ఆకుల వెంకట సుబ్బరాయన మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లులో చోరీలకు పాల్పడే బైక్ దొంగను మంగళవారం కసాపురం పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పార్కింగ్ చేసిన బైకులను చోరీలకు పాల్పడే దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి న 4 బైక్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
SRPT: మూసీ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4128.37 క్యూసెక్కుల నీరు వస్తుంది. మంగళవారం ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లను ఎత్తి 3850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 643 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
E.G: తాళ్లపూడి మండలం పెద్దేవంలో గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధితో గేదెలు చనిపోతున్నాయని గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ తెలిపారు. చనిపోయిన గేదెలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మంగళవారం పెద్దవం గ్రామంలో ఆయన మాట్లాడారు. గేదెల మృతిపై కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని, రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
PPM: ఎస్సీ సామాజిక వర్గాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఆలోచించిన ఏకైక నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం జరిగే వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ విభాగం విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని అన్నారు. ఈమేరకు అయన మంగళవారం పార్వతీపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
SKLM: ప్రజలకు న్యాయ వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఆయన కార్యాలయంలో పారా లీగల్ వాలంటీర్స్‌తో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని కోరారు.
PDPL: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న కవ్వం పల్లి అరుణ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసిన గోదావరిఖని వన్ టౌన్ డీసీపీ కర్ణాకర్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి మూడు కేసులలో 23.6 గ్రామ్స్ బంగారం, 45 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
GNTR: తురకపాలెంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నాయని ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటన చేసి ప్రాంత పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం, వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
NLG: కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో ఈనెల 24, 25, తేదీల్లో జరిగే శ్రీ ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి ముత్యాలమ్మ పండగకు రావాలని కోరారు.
JN: రేపు జనగామ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించబోయే ప్రజాపాలన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రానున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. డీసీపీ, ఆర్డీవో తదితరులున్నారు.