BPT: నేపాల్‌లో హింసాత్మక ఘటనల కారణంగా చిక్కుకుపోయిన 215 మంది తెలుగువారిని రక్షించి, స్వస్థలాలకు చేర్చడంలో మంత్రి లోకేష్ చేసిన కృషి అభినందనీయమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కొనియాడారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ స్పందించి, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్‌గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు.
GNTR: పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, ధ్యాన బుద్ధ, పులిచింతల ప్రాజెక్టులు కొత్త జిల్లాలోకి మారనున్నట్లు సమాచారం.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం వైద్య సిబ్బందికి హెపటైటిస్–బి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి హెపటైటిస్–బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
SRPT: నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు శుక్రవారం ఉదయం భారీ క్యూ కట్టారు. గత 15 రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నామని, లైన్‌లో గంటల తరబడి నుంచున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులపై కక్ష సాధింపు చర్యలను మానుకొని యూరియాను సరఫరా చేయాలన్నారు.
KNR: సైదాపూర్ మండలంలో వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సైదాపూర్ చెరువులో నుంచి నీరు భారీగా నీరు వాగులోకి చేరి ప్రవహిచడంతో సోమారం మోడల్ స్కూల్ జలమయం అయింది. స్కూల్లోని హాస్టల్ విద్యార్థులు అక్కడే ఉండడంతో తల్లితండ్రులు భయందోళనకు గురయ్యారు.
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో రైతు నక్కా శ్రీనుకి చెందిన ఐదు గేదెలు శుక్రవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని రైతుని పలకరించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని దైర్యం చెప్పారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
KMR: పెద్దకొడఫ్గల్ మండలం కాటేపల్లి తండాకు చెందిన మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రక్తం తక్కువగా ఉందని బాన్సువాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాన్సువాడకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో రాంపూర్ వద్ద ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.
WNP: పెద్దమందడి పరిధిలో వివిధ గ్రామాలలో చాలా కాలంగా కోర్టులో పెండిగ్‌లో వున్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి ఎస్సై శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
TG: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కలెక్టరేట్ పై అంతస్తు కూలడంతో అధికారులు భవనానికి తాళం వేశారు. పై అంతస్తులోని మిగతా గదులకు కూడా అనుమతి నిరాకరించారు. దీంతో కార్యకలాపాల కోసం మరో భవనాన్ని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నిన్న రాత్రి కలెక్టరేట్‌లోని పైకప్పు కూలిన విషయం తెలిసిందే.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కోసం మహిళలు బారులు తీరారు. నెల రోజులుగా ఇంటి పనులు మానుకొని, రోజులు తరబడి క్యూ లైన్‌లో నిలబడే పరిస్థితి ఏర్పడిందని మహిళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా సప్లై చేయాలన్నారు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన టైం ట్రావెలింగ్ మూవీ ‘ఆదిత్య 369’. 1991లో విడుదలై సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ మూవీ రాబోతున్నట్లు సమాచారం. దీన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నట్లు టాక్. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ మూవీలో కనిపించనున్నారట. ఇక ఈ మూవీని దసరా కానుకగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
WGL: వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. రూ.10 లక్షలతో దేవాలయ ఆర్చీలు, గర్భాలయం, స్తంభాలు, ప్రాంగణం, రాజగోపురానికి రంగులు వేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చు దాతలు ముందుకు వచ్చి చేయిస్తున్నట్లు దేవాలయ అధికారులు స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఇతర పనులు కూడా దాతల సహకారంతో చేయనున్నట్లు వివరించారు.
కోనసీమ: అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కొందరు వైద్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్టాఫ్ నర్స్ సతీ సుమతి మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు పిర్యాదు చేశారు. గురువారం రాత్రి అమలాపురంలోని మంత్రి నివాసం వద్ద ఆయనను కలిసి తన ఆవేదనను చెప్పుకుంది. 2024లో జరిగిన ఒక దొంగతనంలో ఒక వ్యక్తి ని పట్టుకోవడంతో తనను వేధింపులు మొదలయ్యాయని సుమతి తెలిపారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
GNTR: ఫిరంగిపురంలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో సీపీఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటియూ మండల నాయకుల ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటియూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, మండల కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.