ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.
బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.