»Apsara Murder Case Another Twist In The Apsara Case She Was Already Married
Apsara Murder Case: అప్సర కేసులో మరో ట్విస్ట్..ఆమెకు ముందే వివాహమైంది!
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
అప్సర హత్య కేసు(Apsara Murder Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ బయటపడింది. అప్సరకు ముందే వివాహం జరిగినట్లు తేలింది. తన భర్తతో విభేదాల అనంతరం ఆమె పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటోంది. జాతకం కోసం మొదట సాయికృష్ణ వద్దకు వెళ్లింది. ఆ తర్వాతే రకరకాల పూజల పేరుతో సాయికృష్ణ(saikrishna) అప్సరకు దగ్గరయ్యాడు.
తనను పెళ్లి చేసుకోవాలని అప్సర(Apsara) ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకోకుంటే తమ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెడతానని పలుమార్లు బెదిరించింది. దీంతో అప్సరను చంపేందుకు సాయికృష్ణ(saikrishna) స్కెచ్ వేసి హత్య చేశాడు. జూన్ 3న పక్కా ప్లాన్‌తో నిందితుడు అప్సరను హత్య(Apsara Murder) చేశాడు.
అప్సర హత్యకేసు(Apsara Murder Case)లో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అప్సర గర్భవతి కాదంటూ ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను వైద్యులు ఇచ్చారు. దీంతో అప్సర గర్భవతి కాదనే విషయంలో క్లారిటీ వచ్చింది. సాయికృష్ణ(saikrishna) తన రిమాండ్ రిపోర్ట్‌లోనూ కీలక అంశాలను వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్‌లో సాయికృష్ణకు అప్సర పరిచయం అయ్యింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరూ మాట్లాడుకునేవారు. అప్సరకు సాయి వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేస్తూ ఉండేవాడు. గతేడాది నవంబర్‌లో ఇద్దరూ కలిసి గుజరాత్ టూర్ కూడా వెళ్లగా అక్కడే వీరి బంధం బలపడిందని పోలీసుల విచారణలో తేలింది.