VSP: విశాఖలోని కరాసాలో దొంగలు హల్ చల్ సృష్టించారు. బుధవారం రాత్రి తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడి, స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. మొత్తం 11 తులాల బంగారం, 20 తులాల వెండి, మరియు రూ. 15,000 నగదును దొంగలు అపహరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీసీపీ లతా మాధురి, సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.