ఏలూరు అశోక్ నగర్ K.P.D.T హైస్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమో, ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కోసం naipunyam.ap.gov.in సంప్రదించాలన్నారు.