HNK: మాజీ మంత్రి, సిద్దిపేట MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో HNK జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షురాలు రావు పద్మ బుధవారం హరీష్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ముందుగా సత్యనారాయణ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.