AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ గ్రామంలో తొలిసారి విద్యుత్ కాంతులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు చేపట్టారు. 17 కుటుంబాలు ఉన్న ఆ గ్రామానికి సుమారు 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేశారు. ప్రతి ఇంటికీ 5 బల్బులు, ఒక ఫ్యాన్ ఏర్పాటు చేశారు.