MNCL: కాంక్రీట్ మిక్సింగ్ మిల్లర్ ఢీకొని బిహార్‌కు చెందిన ప్రసాద్ (43) అనే కూలి మృతి చెందిన ఘటన మందమర్రిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ శశిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం అనంతరం నిద్రిస్తున్న కూలిపై నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా మిల్లర్‌ను తీసుకువెళ్లాడు. దీంతో కూలి అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.